శ్రుతిహాసన్ వి ఒకే రోజు రెండు

By Srikanya

హైదరాబాద్ : మొదట్లో అన్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నా ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ లలో దూసుకుపోతోంది శ్రుతిహాసన్. ఆమె బాలీవుడ్ లో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల తేదీలు పెట్టుకోవటమే అందుకు తార్కాణం. ఆ చిత్రాలు 'డి-డే', 'రామయ్యా వస్తావయ్యా' .

ఈ విషయమై శృతిహాసన్ మాట్లాడుతూ... ''నేను బాలీవుడ్‌లో తాజాగా నటించిన 'డి-డే', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. జులై 19న ఈ రెండు చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అందుకే ఆ రోజు కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అంది. 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అయితే తెలుగులో సూపర్ హిట్టైన నువ్వు వస్తానంటే..నే వద్దంటానా రీమేక్. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి.

నిఖిల్‌ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన 'డి-డే'లో శృతి హాసన్ వేశ్య పాత్రను పోషించింది. అర్జున్‌ రామ్‌పాల్‌ - శ్రుతిల మధ్య ఘాటైన సన్నివేశాలున్నాయని సమాచారం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారి సినిమాకు బోల్డ్ క్రేజ్ తెచ్చిపెట్టింది.

'డి-డే' గురించి శ్రుతి మాట్లాడుతూ ''కథ ప్రకారం చిత్రానికి ఏ సన్నివేశాలు అవసరమో వాటిలో కనిపించాను. నా పాత్ర సవాలుతో కూడుకొన్నది. అందుకే దర్శకుడు కథ వినిపించినపుడు ఎలాంటి ఆలోచన చేయకుండా నటించేందుకు అంగీకరించాను'' అని తెలిపింది. ఇక శృతిహాసన్ నటించిన బలుపు ఈ వారమే విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన ఆమె 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X