twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్: రామ్ సరసన శృతి హాసన్ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్: శృతి హాసన్ మరో చిత్రం కమిటైంది. గబ్బర్ సింగ్ హిట్టవటంతో విజయోత్సాహంలో ఉన్న శృతి ఈ సారి రామ్ సరసన చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం మరేదో కాదు బెల్లంకొండ సురేష్ ఆ మధ్యన ప్రారంభించి ఆపేసిన కందిరిగ చిత్రం సీక్వెల్. సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై, మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. ఐదు నెలల క్రితం ఈ చిత్రం ప్రారంభమై ఆగిపోయింది. ప్రస్తుతం శృతి హాసన్... రవితేజ సరసన బలుపు చిత్రం చేస్తోంది.

    అప్పట్లో కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పై బెల్లంకొండ సురేష్ చేయి చేసుకున్నాడంటూ చేసిన ఫిర్యాదు అంతటా చర్చనీయాంశమైంది. ఈ మేరకు దర్శకుడు ఎపీ ఫిల్మ్ డైరక్టర్స్ అసోశియేషన్ లో కంప్లైంట్ చేసారు. రామ్ హీరోగా రూపొందించిన కందిరీగ తో సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు అయ్యారు. ముందుగా చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం ప్రస్తుతం రామ్ హీరోగా మరో చిత్రాన్ని శ్రీనివాస్ తెరకిక్కించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

    బెల్లంకొండ సురేష్ కి, సంతోష్ శ్రీనివాస్ కి మధ్య వివాదం రెమ్యునేషన్ విషయంలో తలెత్తిందని, రెమ్యునేషన్ విషయంలో మాట మాట రావటంతో కోపగించిన బెల్లంకొండ సురేష్.. వెంటనే ఆవేశంలో శ్రీనివాస్ ని కొట్టాడని చెబుతున్నారు. దర్శకుడుగా సంతోష్ శ్రీనివాస్ కి లైఫ్ ఇచ్చిన బెల్లంకొండకు రెమ్యునేషన్ విషయంలో శ్రీనివాస్ పట్టుబట్టడంతో పట్టరాని కోపం వచ్చే చెయ్య జారాడని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడా వివాదం పూర్తిగా సెటిలయ్యి... సినిమా మళ్లీ పట్టాలు ఎక్కడం మంచి పరిణామమే.

    ఇక రామ్ ప్రస్తుతం హీరోగా భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం టైటిల్ 'ఒంగోలు గిత్త'. ఈ చిత్రం షూటింగు నాన్ స్టాప్ గా జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి తుఫాన్ దెబ్బ కొట్టింది. ఈ చిత్రం కోసం వేసిన సెట్ పూర్తిగా తడిసి ఆగిపోయి మళ్లీ మొదలైంది.

    English summary
    Shruti is cast opposite Ram in a new film, which is said to be a sequel to Kandireega. This movie was supposed to start five months ago but it ran into trouble when the director Santosh Srinivas lodged a complaint with Director's Association alleging that the film's producer Bellamkonda Suresh beat him up. Five months after the incident, everything seems to be settled and the film is set to take off.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X