»   » నాన్న పేరుకు మచ్చ తీసుకురాకూడదనే...శ్రుతి హాసన్

నాన్న పేరుకు మచ్చ తీసుకురాకూడదనే...శ్రుతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"మా నాన్న గొప్ప నటుడు.ఆయన పేరుకు మచ్చ తీసుకురాకూడదని...నాకు నేను చిన్న చిన్న హద్దులు నిర్ణయించుకొన్నాను. సినిమా కోసం తెరపై గ్లామర్ ఒలకబోయాలన్నా...నేను ఫలానా ఆయన కూతురుననే విషంయ ఓసారి గుర్తుచేసుకొంటాను..అలాగే ఆయనకు కూతురుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. అలాగే చిన్నపాటి భయం కూడా ఉంది.. అంటూ చెప్పుకొస్తోంది శ్రుతిహాసన్. ఆమె ఈ రోజు(శుక్రవారం) 25వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించిది. ఇక తన కెరీర్ గురించి చెబుతూ..ఈ రోజు నేను మధూర్ బండార్కర్ దర్శకత్వంలో చేసిన 'దిల్‌ తో బచ్చా హై జీ' చిత్రం రిలీజవుతోంది. అందులో పాత్ర నాకు అన్నివిధాల సరిపడింది.. సంతృప్తినిచ్చింది. తమిళంలో మురుగన్‌దాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అందులో సూర్యకు జోడీగా కనిపిస్తాను. తెలుగులో మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం కథలు వింటున్నాను. పాత్ర నచ్చితే దర్శకుడు ఎవరైనా సరే...గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాను అంటోంది. ఇక ఆమె ఎన్టీఆర్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే గర్జన, మహేష్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందే ది బిజెనెస్ మేన్ చిత్రాలు కమిటైంది. శ్రుతి హాసన్ కి ధట్స్ తెలుగు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu