»   » సాయి ధరమ్ సరసన పవన్ కళ్యాణ్ హీరోయిన్?

సాయి ధరమ్ సరసన పవన్ కళ్యాణ్ హీరోయిన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ కెరీర్ ‘గబ్బర్ సింగ్' సినిమాతోనే విజయపథంలో ప్రయాణించడం మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ తర్వాత ఆమె మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జుణ్ లతో కలిసి నటించింది. తాజాగా ఆమో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో నాగ చైతన్య హీరోగా ‘మజ్ను' పేరుతో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరో జీవితంలో ముగ్గురు మహిళలు ఉంటారు. అందులో ఒకరుగా శృతి హాసన్ నటిస్తున్నట్లు సమాచారం.

Shruti opposite Sai Dharam Tej?

మరో రూమర్ ఏమిటంటే... సాయి ధరమ్ తేజ్ కూడా ఈ చిత్రంలో ఓ ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని, ఇందులో ఆయన భార్య పాత్రలో శృతి హాసన్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించబోతున్నారు.

Shruti opposite Sai Dharam Tej?

నాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో' సినిమా వివరాల్లోకి వెళితే...
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రోడ్డుపై బైక్ ఉండటాన్ని బట్టి ఇదొక అడ్వెంచరస్ రోడ్ ట్రిప్పుకు సంబంధించిన కాన్సెప్టుతో సాగుతుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో హీరో రానా కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఎం రవీందర్ రెడ్డి నిర్మాత. సునితా తాటికి చెందిన గురు ఫిల్మ్స్ బేనర్లో కోన వెంకట్ సమర్పకుడిగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రానికి గౌతం మీనన్ దర్శకత్వం వహించనున్నారు.

English summary
In the Naga Chaitanya's upcoming film, Majnu, the Telugu remake of Malayalam super hit Premam film, it is known that the protagonist has three women in his life and that Shruti Haasan is playing one of those. Now rumours are that Sai Dharam Tej is going to play an important cameo in the movie and Shruti will be his wife.
Please Wait while comments are loading...