»   » చేతిలో ఒక్క సినిమా లేదు, ఉన్నదీ ఆగిపోయింది... నిజంగా శృతికి ఇది బ్యాడ్ టైం

చేతిలో ఒక్క సినిమా లేదు, ఉన్నదీ ఆగిపోయింది... నిజంగా శృతికి ఇది బ్యాడ్ టైం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఐరన్ లెగ్ అన్న ముద్రని చాలాకాలమే మొసింది శృతీహసన్. తొలి అడుగుల్లోనే విపరీతమైన వ్యతిరేక పరిస్థులని ఎదుర్కుంటూ వచ్చింది. ఒక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా అవకాశాల కోసం ఎదురు చూసే స్థాయిలో ఉందిపోయింది కొన్నాళ్ళు. అయితే తర్వాత పరిషితి కొంచం మెరుగు పడుఇంది. తెలుగులో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తో ఒక్క సారి శృతీ కెరీర్ గ్రాఫ్ దూసుకు పోయింది కానీ అంతలోనే మళ్ళీ తగ్గిపోయింది. ఇప్పటికిప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు శృతి చేతుల్లో.

'యారా' ఆగిపోయింది

'యారా' ఆగిపోయింది

అసలే కొత్త అవకాశాలు లేని శృతికి ఇంకో ఎదురు దెబ్బ తగిలింది. నిర్మాణంలో వున్న ఆమె హిందీ చిత్రం 'యారా' ఆగిపోయింది. చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఈ చిత్రాన్ని ఆ నిర్మాతలు ఫైనల్‌గా కాల్‌ ఆఫ్‌ చేసారు. ఇందులో విద్యుత్‌ జమావాల్‌ హీరోగా నటిస్తున్నాడు. యాభై ఏళ్ల వృద్ధుడిగా కనిపించడం కోసం పాపం చాలా కష్టపడ్డాడు. అతని దురదృష్టమో, శృతి బ్యాడ్‌ టైమో కానీ యారా ఆగిపోయింది.

Sruthi hassan said that "I'll Become Mom before Marriage"
కాటమ రాయుడు

కాటమ రాయుడు

గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్ తో జతకట్టిన కాటమ రాయుడు కూడా ఆమెకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. చిత్రంలో చాలా కామెడీగా కనిపించిందంటూ, అసలు సినిమాకి ప్రధానమైనస్ ఆమే అంటూ ట్రోలింగ్‌కి గురయిన శృతిహాసన్‌కి అక్కడి నుంచి అన్నీ చేదు వార్తలే వినిపిస్తున్నాయి.

సంఘమిత్ర నుంచి తప్పించారు

సంఘమిత్ర నుంచి తప్పించారు

కష్టపడి కత్తి సాము నేర్చుకున్న తర్వాత ఆమెని సంఘమిత్ర చిత్రం నుంచి తప్పించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ సినిమా బెహన్‌ హోగీ తేరీ అనే చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పల్టీ కొట్టడంతో శృతిహాసన్‌ మరింత డీలా పడింది. ఈ చిత్రం తనకి నటిగా మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తే, సినిమాకి మైనస్సే శృతి అని విమర్శకులు తేల్చేసారు. దాంతో పరిస్థితి ఇంకా దారుణం గా మారింది.

శభాష్‌ నాయుడు తప్ప

శభాష్‌ నాయుడు తప్ప

ప్రస్తుతం శృతి చేతిలో తన తండ్రి దర్శకత్వంలో చేస్తోన్న శభాష్‌ నాయుడు తప్ప ఇంకో సినిమా లేదు. శభాష్‌ నాయుడు కూడా చాలా కాలంగా నిర్మాణ దశలోనే వుంది. అది ఎప్పటికి రిలీజ్‌ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. అది రిలీజ్‌ అయి హిట్‌ అయితే తప్ప శృతిని మళ్లీ చిత్ర పరిశ్రమ పట్టించుకునే ఛాయలు కనిపించడం లేదు. ఈ టైమ్‌ గ్యాప్‌లో శృతి తన విదేశీ బాయ్‌ఫ్రెండ్‌తో దేశాలు చుట్టేస్తోంది.

English summary
Sruthi Hasan facing a cricis badly ofter Her Bollywood Movie Yaraa shelved
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu