సెక్స్ సీన్ ఎఫెక్ట్ :నిర్మాతపై శృతిహాసన్ కేసు
హైదరాబాద్ : శృతిహాసన్ ఇప్పుడు రంగాచారి అనే తమిళ నిర్మాతపై మండిపడుతోంది. ఆమె లీగల్ గా అతనిపై కేసు పెట్టడానికి రెడీ అవుతోంది. ఎంతకంటే ఆమె అప్పట్లో నటించిన 'డి-డే' తమిళంలో డబ్బింగ్ చేసి దావూద్ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. నిర్మాతతో ఎగ్రిమెంట్ లో ఆ సినిమా డబ్బింగ్ విషయమై ఆమె అనుమతి అవసరమవుతుందని ఉందని,దాన్ని దాన్ని అతిక్రమించాడని ఆమె ఆరోపిస్తోంది.
నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన 'డి-డే'లో శృతి హాసన్ వేశ్య పాత్రను పోషించింది. అర్జున్ రామ్‌పాల్ - శ్రుతిల మధ్య ఘాటైన సన్నివేశాలున్నాయి. అప్పట్లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారి సినిమాకు బోల్డ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు దాన్నే క్యాష్ చేసుకుందామనే ఆలోచనతోనే నిర్మాత రామాచారి డబ్బింగ్ చేస్తున్నట్లు తమిళ వర్గాలు చెప్తున్నాయి.

దర్శకుడు నిఖిల్ అధ్వానీ సైతం ఈ విషయమై సీరియస్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ...ఈ విషయమై నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. చిత్రం రైట్స్ అమ్మేటప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు. ఈ విషయమై నేను చాలా బాధపడుతున్నాను. అలాగే దావూద్ అనే టైటిల్ పెట్టడం కూడా మిస్ లీడ్ అవుతోంది. మేం ఈ విషయమై లీగల్ గా ఎప్రోచ్ అవుతున్నాను.
'డి-డే' గురించి శ్రుతి మాట్లాడుతూ ''కథ ప్రకారం చిత్రానికి ఏ సన్నివేశాలు అవసరమో వాటిలో కనిపించాను. నా పాత్ర సవాలుతో కూడుకొన్నది. అందుకే దర్శకుడు కథ వినిపించినపుడు ఎలాంటి ఆలోచన చేయకుండా నటించేందుకు అంగీకరించాను'' అని తెలిపింది.
నిఖిల్ అద్వాని దర్శకత్వంలో శ్రుతి హాసన్ నటించిన 'డి-డే' సినిమాలో ఆమె నటనకుగానూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. అర్జున్ రాంపాల్, ఇర్ఫాన్ ఖాన్ , హ్యుమా ఖురేషి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. శృతిహాసన్ ఒక ముఖ్యమైన పాత్రపోషించింది. కరాచీ ప్రాంతానికి చెందిన ఒక వేశ్య పాత్రలో ఆమె కనిపించనుంది. ఈమె హీరోతో ప్రేమలో పడినతరువాత కధ ఏ విధంగా మలుపుతిరిగింది అనేది ఆసక్తికరంకానుంది. శృతి కనిపించేది కొద్దిసేపే అయినా ఆమె పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది.


Click it and Unblock the Notifications











