»   » ద్యావుడా..! హీరోకు అంగం స్తంభించదు, ఇదేం సినిమా నాయనా (ట్రైలర్)

ద్యావుడా..! హీరోకు అంగం స్తంభించదు, ఇదేం సినిమా నాయనా (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పోయిన సంవత్సరం టాలీవుడ్ లో వచ్చిన నరుడా డోనరుడా మాతృక విక్కీ డోనర్ బాలీవుడ్ లో వచ్చినప్పుదు రేగిన దుమారం గుర్తుంది కదా... తెలుగులోకి వచ్చేటప్పటికి మామూలైపోయింది గానీ. బాలీవుడ్ లో వచ్చినప్పుడు మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా "చీ..!" "థూ..!!" అనేసారు అక్కడి జనం. దానికే రియాక్షన్ అలా ఉంటే ఇప్పుడు రాబోతున్న శుభ్ మంగల్ సావధాన్ అనే సినిమా మరీ ఇంకో అడుగు ముందుకేసింది.

తమిళ డైరెక్టర్ ప్రసన్న

తమిళ డైరెక్టర్ ప్రసన్న

ఈ సారి ఇంతవరకూ ఎవ్వరూ టచ్ చేయని సబ్జెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు. తమిళ డైరెక్టర్ ప్రసన్న... అయితే తమిళ్ లో కాకుండా బాలీవుడ్ నే ఎంచుకున్నాడు. ఎంతయినా సాంప్రదాయ వాదులైన తమిళులు ఇలాంటి సబ్జెక్ట్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటారో ఊహించి బాలీవుడ్ అయితే సేఫ్ అనుకున్నాడేమొ గానీ అక్కడే మొదలు పెట్టాడు.. ఇంతకీ అంత బీభత్సమైన సబ్జెక్ట్ ఏమిటంటే. హీరో కి అంగస్తంబన సమస్య ఉంటుందట... అదే మరి అందుకే ఇంత గొడవానూ..

శుభ్ మంగళ్ సావధాన్

శుభ్ మంగళ్ సావధాన్

'శుభ్ మంగళ్ సావధాన్' సినిమా కాన్సెప్ట్ మాత్రం బాగానే పాపులర్ అయ్యేలా కనిపిస్తోంది, దీనికి తోడు కామెడీ కూడా బాగానే కలిపారు.ఇంతకీ కథేమిటంటే..... ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడతారు. పెద్దలు పెళ్ళి కుదిర్చి ఎంగేజ్మెంట్ జరిగాక వీరి ప్రేమాయణం మొదలవుతుంది.

స్తంభించకపోయినా ఐ డోంట్ కేర్

స్తంభించకపోయినా ఐ డోంట్ కేర్

అలాంటి టైములో ఓరోజు సరాదాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటే.. ఇద్దరూ కూడా సెక్స్ చేసుకుందాం అనుకుంటే.. సరిగ్గా అప్పుడే హీరోకు అంగం స్తంభించదు. అతనికి అంగస్తంభన సమస్య ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ పెళ్ళి చేసుకోవాలా వద్దా? అలాంటోడ్ని పెళ్ళి చేసుకుని ఏమి ఎంజాయ్ చేస్తావ్ అంటూ కుటుంబ సభ్యులు.. నాకు ప్రేమ ముఖ్యం అతనికి స్తంభించినా స్తంభించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ ఆ అమ్మాయి.. ఇప్పుడేమవుతుంది అనేదే సినిమా.

భూమి పడ్నేకర్ హీరోయిన్ గా

తమిళ డైరక్టర్ ప్రసన్న హిందీలో నిర్మించిన ఈ సినిమాలో కూడా అప్పటి విక్కీ డోనర్ ఫేమ్ అయుష్మాన్ ఖురానానే హీరోగా చేస్తున్నాడు. ఆ మధ్య లావెక్కిన క్యారెక్టర్ తో తెరంగేట్రం చేసి ఇప్పుడు పూర్తి స్థాయి స్లిమ్ అయిన భూమి పడ్నేకర్ హీరోయిన్ గా చేస్తోంది.. కాన్సెప్ట్ బాగానే ఉంది, నిజానికి ఇది ఇప్పటి తరాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కానీ ఎంతవరకూ జనం దీన్ని ఆదరిస్తారన్నది మాత్రం క్వశ్చన్ మార్కే...

English summary
The trailer of Shubh Mangal Saavdhan, the new film starring Ayushmann Khurrana and Bhumi Pednekar, releases Tuesday, revealed the
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu