»   » "శ్యాం గోపాల్ వర్మ...నా సినిమా నా ఇష్టం" టైటిల్‌తో మూవీ ప్రారంభం

"శ్యాం గోపాల్ వర్మ...నా సినిమా నా ఇష్టం" టైటిల్‌తో మూవీ ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సెటైర్లు వేస్తూ ఓ సినిమా రాబోతోంది. 'శ్యాం గోపాల్ వర్మ' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రానికి 'నా సినిమా నా ఇష్టం' అనేది సబ్ టైటిల్. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు షఫి ఈచిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జోయా ఖాన్ హీరోయిన్ గా చేస్తోంది.

సమిష్టి క్రియేషన్స్ బేనర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ రాజు, రాకేష్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మంత్ర ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ శ్రీ వాత్సవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.

రక్తపాత సినిమాలు తీయడం అతని నైజం, దాని ఫలితం ఇప్పుడు అనుభవించక తప్పదు అంటూ సినిమా పోస్టర్లపై కొటేషన్లు పెట్టడాన్ని బట్టి...... దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పూర్తి స్థాయి విమర్శనాత్మకంగా ఉంటుందని స్పష్టమవుతోంది. అందరిపై సెటైర్లు వేసే రామ్ గోపాల్ వర్మపై సెటైర్లు వేస్తూ సినిమా కాబట్టి అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

రామ్ గోపాల్ వర్మపై సెటైరా?

రామ్ గోపాల్ వర్మపై సెటైరా?


రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలు విజయవంతమైన చిత్రాలు తీసి ప్రేక్షకుల మెప్పుపొందారు. అయితే రాను రాను వర్మ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం మనేసి టార్చర్ పెట్టడం మొదలు పెట్టాయి. ఈ అంశాన్ని సినిమాలో ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రారంభ కార్యక్రమం

ప్రారంభ కార్యక్రమం


శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి ప్రొడక్షన్ డిజైనర్ సుబ్బారెడ్డి క్లాప్ ఇవ్వగా, దర్శకుడు వివేక్ కృష్ణ కెమెరా స్విచాన్ చేసారు.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...


ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న నేను, విజయ్ కుమార్ రాజు కలిసి సంయుక్తంగా సమిష్టి బ్యానర్ స్థాపించి కొత్త తరహా చిత్రాలు నిర్మించాలన్న ఉద్దేశ్యంతో తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో హీరో ఓ దర్శకుడు. రక్తపాతం, హింసాత్మక చిత్రాలు నిర్మించే దర్శకుడు చివరికి వాటి ద్వారా ఏం పొందాడు? ఏం పోగొట్టుకున్నాడు? అన్న పాయింటుతో సెటైరికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం' అన్నారు.

ఎవరిని ఉద్దేశించి?

ఎవరిని ఉద్దేశించి?


ప్రత్యేకంగా ఎవరినో ఉద్దేశించి చేస్తున్న సినిమా కాదు. కానీ టైటిల్ ని బట్టి సినిమా ఎవరిని ఉద్దేశించి చేస్తున్నానో ప్రేక్షకులే అర్థం చేసుకోవాలి అంటున్నారు దర్శకుడు.

నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...


మంచి సినిమాలు నిర్మించాలన్న ఉద్దేశ్యంతో ఈ సంస్థను స్థాపించాం. మా సంస్థలో నిర్మిస్తున్న తొలి చిత్రమిది. డిసెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. నటనకు ఆస్కారమున్న కథ ఇది. ఈ తరహా కథలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని షఫి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : మంత్ర ఆనంద్, కెమెరా : రాహుల్ శ్రీవాత్సవ్, ప్రొడక్షన్ డిజైనర్: సుబ్బారెడ్డి, ఆర్ట్: పార్థ సారథి వర్మ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాకేష్ శ్రీనివాస్.

English summary
A Shyam Gopal Varma Movie Opening event held at Hyderabad. Actor Shafi, Actress Zoya Khan graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu