»   » కట్టప్ప కనిపించుట లేదు: తమిళ నాట కొత్త కలకలం

కట్టప్ప కనిపించుట లేదు: తమిళ నాట కొత్త కలకలం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "బాహుబలి" తమిళనాట కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సత్యరాజ్‌ పాత్ర కూడా అన్నివర్గాల ప్రేక్షకులను రంజింపజేసింది. కట్టప్ప పాత్రకు సంబంధించి ఇప్పటికే పలు హాస్య వీడియోలు, ఫొటోలు కూడా వచ్చాయి.

తమిళనాట ఆ స్థాయిలో రీచ్‌ అయిందా కట్టప్ప పాత్ర. ఈ నేపథ్యంలో ఆ కట్టప్ప కనిపించడం లేదంటూ సత్యరాజ్‌ కుమారుడు శిబిరాజ్‌ వెతుకుతున్నారు. అది నిజమైన వెతుకులాట కాదు సుమా...! "కట్టప్పావ కానోం" (కట్టప్ప కనిపించడంలేదు) అనే పేరిట ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సత్యరాజ్‌, శిబిరాజ్‌లు కలసి "జాక్సన్‌ దురై"లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Sibiraj's next has been titled 'Kattappava Kanom'

ఆ తర్వాత మణి దర్శకత్వంలో "కట్టప్పావై కానోం" సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాకు కట్టప్ప పాత్రకు ఏమాత్రం సంబంధం లేదని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఆ పాత్ర కోసం తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నామని తెలిపారు. సత్యరాజ్‌, శిబిరాజ్‌ కలిసి నటించిన "జాక్సన్‌ దురై" ని త్వరలోనే తెలుగులో "కట్టప్ప రాజు" పేరిట విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి కట్టప్ప పేరు బాగా రీచ్‌ కావడంతో ఆ పేరునే వాడుకుంటున్నారు తండ్రీకుమారులు.

English summary
The latest news coming in suggests the film has been titled Kattappava Kanom. The name Kattappa, as many will recall, has become famous among film lovers after the release of last year's blockbuster Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu