»   »  ప్చ్...వినాయక్‌, పూరి దృష్టిలో నేను హీరోనే కాదు

ప్చ్...వినాయక్‌, పూరి దృష్టిలో నేను హీరోనే కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "నాకు స్టార్‌ డమ్‌ ఇచ్చింది నిస్సందేహంగా తెలుగు ప్రేక్షకులే. అయితే నేను ఇక్కడ స్టార్‌ అయినప్పుడు ఉన్న స్టార్ డైరక్టర్స్ లో ఒకరు కూడా కుటుంబ కథల్ని, కాన్సెప్ట్‌ సినిమాల్ని తీసేవారు కాదు. ఆ సమయంలో పూరి జగన్నాథ్‌, వి.వి.వినాయక్‌లాంటి దర్శకుల దృష్టిలో నేను హీరోనే కాదు.

దీంతో నాకు తగ్గ కథలు రాలేదు. నేను తెలుగులో జోరుమీదున్న సమయంలో కె.విశ్వనాథ్‌లాంటి దర్శకులు సినిమాలు తీసుంటే ఆ కథ వేరేలా ఉండేది." అంటూ తను తెలుగులో వెనకబడటానికి కారణం చెప్పుకొచ్చారు హీరో సిద్దార్ద.

Siddardha about tollywood Directors

‘బొమ్మరిల్లు', ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా', ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం'లాంటి సూపర్ హిట్ చిత్రాలతో సిద్దార్ద పేరు తెలుగులో మార్మోగిపోయింది. ఆ ఇమేజ్‌నీ చూసి, ఇక్కడ సెటైలయ్యి.. అదరగొడతాడని వూహించారంతా. కానీ లవర్‌బాయ్‌ అన్న ఇమేజ్‌కే పరిమితం కావల్సి వచ్చింది. అయితే ‘ఆట', ‘ఓయ్‌', ‘బావ'లాంటి చిత్రాల తర్వాత తెలుగులో ఆయనకి తగ్గ కథలు రాలేదు.

అయినా నాతో సినిమాలు తీయనందుకు వాళ్లు ఫీలవ్వాలి కానీ... నేనెందుకు అవుతాను? ఛాన్సే లేదు. ఏంటి... నా పొగరు తగ్గిందనుకొంటున్నారా? నా హెయిర్‌స్టైల్‌, కళ్ల జోడు మారిందేమో తప్ప నాలోని పొగరు మాత్రం ఇంకా తగ్గలేదు అని చెప్పుకొచ్చారు.

Siddardha about tollywood Directors

ప్రస్తుత పరిస్ధితి గురించి మాట్లాడుతూ...తెలుగులో ఇటీవల స్క్రిప్ట్‌ బేస్డ్‌ సినిమాలు విరివిగా వస్తున్నాయి. ఇదొక మంచి పరిణామం. ‘నాన్నకు ప్రేమతో', ‘భలే మంచి రోజు' చాలా మంచి సినిమాలు. ‘పోకిరి', ‘బొమ్మరిల్లు' ఒకే సంవత్సరంలో వచ్చాక మళ్లీ ఆస్థాయిలో సినిమాలొచ్చింది 2015లోనే.

కొన్నిసార్లు చిత్ర పరిశ్రమే సినిమాని నాశనం చేస్తుంటుంది. ఆ దశలో ప్రేక్షకులే ‘సినిమా అంటే ఇది కాదు... ఇది' అంటూ మలుపు తిప్పుతారు. తాము ఎలాంటి సినిమాల్ని చూడాలనుకొంటున్నామో చాటి చెబుతుంటారు. ‘బాహుబలి', ‘శ్రీమంతుడు' సినిమాల్ని చూసి చాలా ఆనందమేసింది.

ఇలాంటి సమయంలో ‘బొమ్మరిల్లు'లాంటి చిత్రాలు వస్తే వసూళ్లకి ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. యువ దర్శకులు కంటెంట్‌కి ప్రాధాన్యమిస్తూ సినిమాలు చేస్తున్నారు కాబట్టి 2016లో తెలుగులో మరిన్ని మంచి చిత్రాలొస్తాయని నమ్ముతున్నా.

English summary
Siddardha said that tollywood Star directors not intrested work with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu