»   »  ‘నాన్నకు ప్రేమతో’ గురించి సిద్దార్ద

‘నాన్నకు ప్రేమతో’ గురించి సిద్దార్ద

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరక్షన్ లో ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ట్రైలర్‌కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. గతంలో ఇంతకుముందెన్నడూ చూడని వెరైటి గెటప్‌లో కనిపిస్తున్న ఎన్టీఆర్‌ను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో హీరో సిద్దార్ద సైతం స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ...

అలాగే ఈ సినిమా ట్రైలర్‌పై ఇప్పటికే మరో దర్సకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ట్రైలర్ స్టైలిష్‌గా, కూల్‌గా ఉందని, తారక్ ఇంతకుముందు చేసిన పాత్రలన్నింటీ కంటే పూర్తి భిన్నంగా సుకుమార్ చూపించారని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇది 'నో నాన్సెన్స్' సినిమాలా కనిపిస్తోందని పోస్ట్ చేశారు. అలాగే సినిమా టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

Siddardha tweet about Naanaku Prematho

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక నిమిషం 29 సెకన్ల ట్రైలర్‌కు అద్బుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికే యుట్యూబ్‌లో 2 లక్షల 50వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఎన్టీఆర్ 25వ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని రాజమౌళి కోరుకున్నట్లు తెలిపారు.

ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించగా....కీలక పాత్రలో జగపతిబాబు, అలాగే ఎన్టీఆర్‌కు బ్రదర్స్‌గా రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ నటించారు. ఆ ట్రైలర్ మరో సారి ఇక్కడ చూడాలంటే...


ఈ ట్రైలర్ చాలా బాగుందని అంటున్నారు చూసినవారంతా. ఎన్టీఆర్ మరోసారి తన స్కిల్స్ తో మైమరించాడనే చెప్పాలి. అలాగే అతని స్టైలిష్ హెయిర్ స్టైల్, గడ్డం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అలాగే ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ రోల్ లో కనిపించిన జగపతిబాబు కూడా చాలా కూల్ గా కనిపించటం గమనించవచ్చు.

నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. '' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

English summary
Actor Siddarth tweeted: Suku, Tarak, Devi, Vijay, Bapi, take a bow. This looks fantastic!
Please Wait while comments are loading...