హీరో సిద్ధార్థ్ ‘గృహం’ ఇదే...
హీరో సిద్ధార్థ్ ‘గృహం’ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ చిత్రానికి మిలింద్ దర్శకత్వం వహిస్తున్నారు.
'బాయ్స్' సినిమా ద్వారా హీరోగా పరిచయం అయి తెలుగు, తమిళంతో పాటు అటు హిందీ సినీ పరిశ్రమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ 'బొమ్మరిల్లు'తో తెలుగులో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసినా మళ్లీ ఆ స్థాయి విజయం అందుకోలేక పోయాడు.
త్వరలో సిద్ధార్థ్ 'గృహం' అనే హారర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం తమిళంలో అవళ్, హిందీలో ద హౌస్ నెక్స్ట్ డోర్.. పేరుతో రిలీజ్ కానుంది.

సీరియస్ హారర్
హాలీవుడ్ తరహాలో సీరియస్ హారర్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మిలింద్ దర్శకత్వం వహిస్తున్నారు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మూడు భాషల్లో
ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషలో తెరకెక్కిస్తున్నట్లు సిద్ధార్థ్ వెల్లడించారు. హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుందని అంటున్నారు.
తమిళ టీజర్
నవంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఇంకా ఆండ్రియా, సురేష్, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
హిందీ టీజర్
హిందీలో `ద హౌస్ నెక్స్ట్ డోర్` పేరుతో ఈ చిత్రం విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











