For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బైర్రాజు గా సిద్దార్ద నవ్వులే నవ్వులు

  By Srikanya
  |

  హైదరాబాద్: రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సిద్దార్ధ ..బైర్రాజు గా కనిపించి నవ్వులు పూయించనున్నారు. సిద్దార్థ్, సమంత జంటగా బి.వి.నందినీరెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేశ్‌బాబు నిర్మించిన చిత్రం 'జబర్‌దస్త్'. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

  సిద్దార్ధ మాట్లాడుతూ...''ఇందులో నేను చేసిన బైర్రాజు కేరక్టర్ ఆద్యంతం నవ్వుల్ని పంచుతుంది. మాస్ టచ్ ఉన్న కామెడీ చిత్రంగా నందిని ఈ సినిమాను మలిచారు. ఈ సినిమాతో నా కెరీర్ పూర్తిగా మారిపోతుందని నా విశ్వాసం. ఒక సూపర్‌హిట్ చిత్రాన్ని నాతో తీసిన నందినికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను'' అని సిద్దార్థ్ చెప్పారు. అలాగే...''పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. మాస్‌ టచ్‌ ఉంటుంది. నా కెరీర్‌ని మార్చే చిత్రం కూడా ఇదే. ఓ మంచి చిత్రాన్ని తీసిన నందినికి కృతజ్ఞతలు. బైర్రాజు పాత్రలో పూర్తి కామెడీ పండిస్తాను. తప్పక హిట్‌ సాధిస్తామన్న నమ్మకం ఉంది'' అన్నారు.

  నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ -''అన్ని వయసులవారినీ ఆకట్టుకునే అంశాలతో నందినీరెడ్డి ఈ చిత్రాన్ని మలిచారు. సిద్దార్థ్, సమంతల నటన యువతరాన్ని కట్టిపడేస్తుంది. తమన్ స్వరాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మా సంస్థ ప్రతిష్టను పెంచే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను'' అన్నారు.

  నా కెరీర్‌లో తొలిసారి ఓ డిఫరెంట్ పాత్ర చేశానని సమంత తెలిపారు. సమంత మాట్లాడుతూ-''అలా మొదలైంది..వంటి మంచి చిత్రాన్ని అందించిన నందినిరెడ్డి దర్శకత్వంలో నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా కెరీర్‌లోనే తొలిసారి ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నా. తప్పక అందరికీ నచ్చే పాత్ర అది'' అన్నారు.

  మాస్ టచ్‌తో నిర్మించిన ఈ చిత్రంలో బైర్రాజుగా సిద్ధార్థ పూర్తి హాస్య పాత్రలో ఇమిడిపోయారని, సూపర్‌హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని చిత్ర దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు. శ్రీహరి, ధర్మవరపు సురేష్, తా.రమేష్, వేణు, కాశీ విశ్వనాథ్, వెనె్నల కిశోర్, దువ్వాసి మోహన్, షాయాజీ షిండే, రామచంద్ర, కాదంబరి కిరణ్‌కుమార్, ప్రగతి, సుష్మ, గీతాభగత్, సీతారెడ్డి, డా.మీనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:వెలుగొండ శ్రీనివాస్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, లక్ష్మీభూపాల్, శ్రేష్ఠ, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: ధమన్, కెమెరా:మహేష్ ముత్తుస్వామి, సంజయ్ లోక్‌నాధ్, నిర్మాతలు:బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:బి.వి.నందినీరెడ్డి.

  English summary
  Siddharth-Samantha starrer Jabardasth releasing on Feb22nd.Siddharth, Samantha and Nithya Menon starrer Jabardasth is all set to release on February22nd. Jabardasth has completed the entire shooting schedule and is gearing up for a grand scale release.Nandini Reddy of 'Ala Modalaindi' fame has directed this romantic entertainer and Bellamkonda Suresh is producing the flick under Sri Sai Ganesh Productions banner.SS Thaman has scored the music. Nandini Reddy informed the media that the film’s shooting has been completed and post production work is in full swing.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X