»   » 'ఫైర్' దర్శకురాలతో...సిద్దార్ద ఇంటర్నేషనల్ సినిమా

'ఫైర్' దర్శకురాలతో...సిద్దార్ద ఇంటర్నేషనల్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్దార్ద త్వరలో ప్రముఖ దర్శకురాలు దీపా మెహతా దర్శకత్వంలో నటించబోతున్నాడు. ప్రముఖ రచయిత రాసిన సల్మాన్ రష్డీ రాసిన బెస్ట్ సెల్లర్ మిడ్ నైట్ చిల్డ్రన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని సిద్దార్ధ స్వయంగా ట్విట్టర్ లో ప్రస్దావిస్తూ...ఇది అఫీషియల్..నేను చాలా ఆనందంగా ఉన్నాను. గొప్ప టాలెంట్ ఉన్న దీపా మెహతా ఇంటర్నేషనల్ చిత్రంలో భాగస్వామిని అవుతున్నందుకు అన్నారు. ఇక ఈ చిత్రంలో శ్రియా శరణ్, సీమా బిశ్వాన్,షబానా అజ్మీ, నందితా దాస్, సోహ అలీ ఖాన్, ఇఫ్రాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇక సిద్దార్ధ హీరోగా రీసెంట్ గా వచ్చిన బావ చిత్రం భాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. అలాగే సిద్దార్ద..దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్సకత్వంలో రూపొందే చిత్రంలో సెలక్టయ్యారు. వీటితో పాటు కె.సూర్య ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందిన అనగనగా ఓ యోధుడు అనే ఫాంటసీ చిత్రం కూడా విడుదలకు రెడీ అవుతోంది. అలాగే దీపా మెహతా గతంలో వాటర్, ఫైర్,ఎర్త్, హెవెన్ ఆన్ ఎర్త్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను డైరక్ట్ చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu