»   »  బాబు సినిమా... ప్రెంచ్ లో కూడా రిలీజ్

బాబు సినిమా... ప్రెంచ్ లో కూడా రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మన హీరోలు చిత్రాలు మన రెండు రాష్ట్రాల్లో ఆడటమే కనాకష్టంగా మారింది. అయితే కొందరు హీరోలు మాత్రం దేశం సరిద్దులు దాటేసి ఇతర దేశాల్లో కూడా తమ జెండా పాతాలని డిసైడ్ అవుతున్నారు. అలా మార్కెట్ విస్తరణలో భాగంగా సిద్దార్ద... తన చిత్రాన్ని ప్రెంచ్ లో విడుదల చేసే నిర్ణయానికి వచ్చారు. బొమ్మరిల్లు తో పాపులరైన ఈ హీరో తర్వాత సరైన హిట్ అనేది లేక చాలా కాకుండా స్ట్రగుల్ పడుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో పిజ్జా దర్శకుడుతో చిత్రం ఓకే చేసి ఓ తమిళ చిత్రం చేసాడు. ఈ చిత్రంపై ఆయనకు పూర్తి నమ్మకాలు ఉన్నాయి. ఆ చిత్రాన్ని తెలుగులో 'చిక్కడు దొరకడు' టైటిల్ తో విడుదల చేస్తున్నారు. అదే చిత్రాన్ని ఇప్పుడు ప్రెంచ్ బాషలో కూడా డబ్ చేసి అక్కడ కూడా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

సిద్ధార్థ, లక్ష్మీమీనన్‌ నటించిన 'చిక్కడు దొరకడు' చిత్రానికి కార్తీక్‌ సుబ్బరాజు దర్శకుడు. యస్‌. కదిరేశన్‌ నిర్మాత. సిద్ధార్థ చెబుతూ ''అందమైన ప్రేమకథలో ఉద్వేగం మిళితమైన పక్కా మసాలా సినిమా ఇది. అంతా మెచ్చేలా కార్తిక్‌ సుబ్బరాజు మలిచారు. సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు ఆకట్టుకుంటాయి. తెలుగులో ఈ చిత్రం విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను''అన్నారు. తెలుగులో సిద్ధార్థ మరోసారి ఆకట్టుకుంటాడని దర్శకుడు అన్నారు.

తమిళంలో 'జిగర్‌తాండా' చిత్రాన్ని తెలుగులో 'చిక్కడు దొరకడు' అనే పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. 5స్టార్‌ ఆడియో అధినేత ఎస్‌.కదిరేశన్‌ సమర్పణలో శ్రీ మీనాక్షి క్రియేషన్స్‌ బ్యానర్‌పై తమిళంలో కార్తిక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వంతో తెరకెక్కింది. అదే బ్యానర్‌లో కదిరేశన్‌ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో సిద్దార్ధ, లక్ష్మీమీనన్‌ జంటగా నటిస్తున్నారు. ఆడియో రంగంలో 19 సంవత్సరాలు అనుభవం వున్న కదిరేశన్‌ తన బ్యానర్‌పై గతంలో తమిళంలో నిర్మించిన 'పొల్లాదవన్‌, ఆడుగలం...' తదితర చిత్రాలన్నీ విజయవంతంగా ప్రదర్శింపబడటమే కాకుండా ఎన్నో అవార్డులను, జాతీయ అవార్డులను కూడా సాధించాయి.

Siddharth film titled De Sang Froid

ఇప్పుడు సిద్దార్ధ, లక్ష్మీమీనన్‌, బాబీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కర్నూలు, హైదరాబాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో, శంకర్‌ 'ఐ' సినిమాకు వాడిన అత్యాధునిక టెక్నాలజీ కెమెరాని ఈ చిత్రానికి ఉపయోగించారు. రెండు సంవత్సరాలపాటు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పుకునే అంశం ఈ సినిమా దర్శకుడు. తమిళ్‌లోనే కాక తెలుగులో కూడా తన మొదటి చిత్రంతోనే కమర్షియల్‌ సక్సెస్‌ని సాధించిన 'పిజ్జా' సినిమా దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ ఈ 'చిక్కడు దొరకడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అదే మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌, అదే టీమ్‌ ఈ చిత్రానికి పని చేసారు.

సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌లో మొదలై కర్నూలు రౌడీషీటర్స్‌ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్‌ అవుతుంది. ఆడియన్స్‌ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్‌ గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళ్‌, తెలుగు రెండు భాషల్లోనూ జులై చివరివారంలో విడుదల చేయబోతున్నారు.

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్‌, కెమెరా: సంతోష్‌ నారాయణ్‌, ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ మూవీస్‌), నిర్మాత: కదిరేశన్‌, దర్శకుడు: కార్తిక్‌ సుబ్బురాజ్‌.

English summary

 Siddardha's 'Jigarthanda' is being released in France too in a dubbed French version and the title is 'De Sang Froid'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu