For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫన్ లవ్ స్టోరీ (‘జబర్‌దస్త్' ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్: అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన దర్శకురాలు నందినీరెడ్డి రెండో చిత్రం 'జబర్‌దస్త్' ఈ రోజు విడుదల అవుతోంది. హీరో సిద్ధార్థ, సమంత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలా మొదలైంది చిత్రం మంచి విజయం సాధించటం, సమంత హీరోయిన్ కావటం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ అంచనాలను ఏ విధంగా అందుకుంటారో మరికొద్ది గంటల్లో తేలనుంది.

  కథ ప్రకారం... లక్ష్యం అంటూ లేకుండా తిరిగే యువకుడు బైర్రాజు (సిద్ధార్థ్‌). ఊరంతా అప్పులు చేసి బలాదూర్‌గా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉన్న యువతి శ్రియ (సమంత). అనుకోని పరిస్థితుల్లో ఈ ఇద్దరూ ఓ చోట కలుస్తారు. కొన్ని రోజులు గడిచాక వీరి మధ్యకి మరో భామ (నిత్య మీనన్‌) ప్రవేశిస్తుంది. ఆమె ఎవరు? ఆ తరవాత కథ ఏ మలుపు తిరిగిందో తెర మీదే చూడాలి.

  దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ ''రెండున్నర గంటల పాటు వినోదాత్మకంగా సాగే చిత్రమిది. సిద్దార్థ్‌, సమంతల హుషారైన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తమన్‌ స్వరాలు ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తున్నాయి. 'అలా మొదలైంది' చిత్రాన్ని మించి విజయం సాధిస్తుంది''అన్నారు.

  నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.... థమన్ సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలు ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చాయని, అందరినీ ఆకట్టుకునే అంశాలు చిత్రంలో ఉంటాయని, రెండవ చిత్రంగా దర్శకురాలు నందినీరెడ్డి ప్రస్టేజియస్‌గా రూపొందించారని తెలిపారు. సిద్ధార్థ, సమంతల నటన హైలెట్‌గా నిలువనుందని, తమ సంస్థనుండి మరో విజయవంతమైన చిత్రంగా జబర్‌దస్త్ నిలుస్తుందని ఆయన తెలిపారు.

  సంస్థ: శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి.
  నటీనటులు: సిద్దార్థ్‌, సమంత, నిత్య మీనన్‌, శ్రీహరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సురేష్, తా.రమేష్, వేణు, కాశీవిశ్వనాథ్, వెన్నెల కిషోర్, దువ్వాసి మోహన్, షాయాజీ షిండే, కాదంబరి కిరణ్‌ కుమార్, ప్రగతి, సుష్మ, గీతా భగత్, సీతా రెడ్డి తదితరులు.
  మాటలు: వెలిగొండ శ్రీనివాస్,
  పాటలు: రామజోగయ్యశాస్త్రి, లక్ష్మీభూపాల్, శ్రేష్ఠ,
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,
  సంగీతం: థమన్,
  కెమెరా: మహేష్ ముత్తుస్వామి, సంజయ్‌లోక్‌నాథ్,
  నిర్మాతలు: బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు,
  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి.నందినీ రెడ్డి.
  విడుదల: 22 పిభ్రవరి, 2013, శుక్రవారం.

  English summary
  Jabardasth is a Telugu romantic comedy film written and directed by Nandini Reddy under the banner of Sri Sai Ganesh Productions. It stars Siddharth and Samantha in the lead roles and Sunil and Nithya Menon in important roles. The film is likely to releasing today(22 February 2013). The film is to be dubbed in Tamil as Dum Dum Pee Pee.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X