»   » దీపిక కోసం నిర్మాతగా మారనున్న సిద్ధార్థ్ మాల్య..!?

దీపిక కోసం నిర్మాతగా మారనున్న సిద్ధార్థ్ మాల్య..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ వ్యాపారవేత్త, శాసనసభ సభ్యులు విజయ మాల్య తనయుడు సిద్ధార్థ మాల్య (జూనియర్ మాల్య) త్వరలోనే ఓ కొత్త అవతారమెత్తనున్నారు. తన ప్రేయసి, బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనే కోసం సిద్ధార్థ్ నిర్మాతగా మారనున్నట్లు సమాచారం. ఇందుకు సిద్ధార్థ్ ఓ ప్రొడక్షన్ హౌస్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే..సిద్ధార్థ్ పెట్టబోయే చలనచిత్ర నిర్మాణ సంస్థకు బ్యానర్ పేరును ఇంకా ఖరారు చేయలేదు. కానీ.. ఈ బ్యానర్ పేరులో మాత్రం తమ కంపెనీ బ్రాండ్ పేరు (కింగ్‌ఫిషర్) వచ్చేలా సిద్ధార్థ్ అడుగులేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. 2012 ఆరంభంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభమయ్యే అవకాం ఉంది.

తన కలను నిజం చేసుకోవడం కోసం సిద్ధార్థ్ ఇప్పటికే డైరెక్టర్లు, ఆర్టిస్టుల కోసం గాలింపు మొదలుపెట్టినట్లు సమాచారం. కానీ అప్పటి వరకూ సిద్ధార్థ్ తన తండ్రి వ్యాపారాన్నే చూసుకోనున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రొడక్షన్ హౌస్ మాత్రం సిద్ధార్థ్ తన ప్రేయసి కోసమే ప్రారంభించనున్నారని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.

ఇటీవల కూడా సిద్ధార్థ్ దీపికకు అద్దిరిపోయే బహుమతి ఇచ్చాడు. 16 కోట్ల రూపయాలు విలువ చేసే ఓ హైటెక్ అపార్ట్‌మెంట్‌ను దీపికకు సిద్ధార్థ్ బహుమతిగా ఇచ్చాడట. దీంతో అవాక్కయిన దీపూ ఆనందం తట్టుకోలేక సీనియర్ మాల్య ముందే జూనియర్ మాల్యకు ముద్దు పెట్టసేందిట.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu