»   » ఈ సినిమా దెబ్బతో కష్టమేంటో తెలుసుకొన్న యంగ్ హీరో..

ఈ సినిమా దెబ్బతో కష్టమేంటో తెలుసుకొన్న యంగ్ హీరో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అనగనగా ఓ ధీరుడు" చిత్రంలో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఒక ప్యాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ ఏ సినిమాకు పడనంత కష్టం ఈ సినిమాకి పడ్డానని సిద్దార్థ్ అంటున్నాడు. ఓ సినిమాలో పూర్తిగా లీనమయిపోయి రక్తం, చెమట, కన్నీళ్ళు ధారపోయడం అరుదుగా జరుగుతుందని, అలాంటి అరుదైన అనుభవాలు ఈ చిత్రానికి ఎదురయ్యాయని సిద్దార్థ అంటున్నాడు. ఈ స్థాయిలో కష్టపడి పని చేసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందని, 'అనగనగా ఓ ధీరుడు" లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని సిద్దార్థ అంటున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu