»   » 'ఈ వయసికరాదు' ట్యాగ్ లైన్ తో ' సిద్దార్థ్ కొత్త చిత్రం

'ఈ వయసికరాదు' ట్యాగ్ లైన్ తో ' సిద్దార్థ్ కొత్త చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్దార్థ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం '180 కి 'ఈ వయసికరాదు' అన్నది ట్యాగ్ లైన్‌. సత్యం సినిమాస్‌ సమర్పణలో ఎస్‌పిఐ సినిమా ప్రైవేట్‌లిమిటెడ్‌, అగ్‌హాల్‌ ఫిలింస్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయేంద్ర దర్శకుడు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. నిత్యమీనన్‌, ప్రియాఆనంద్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్యాచ్‌వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. 'ఇది రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. 500 యాడ్స్‌ ఫిలింస్‌ చేసిన అనుభవం జయేంద్రకుంది. నాతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. ఇద్దరు హీరోయిన్లు ఉంటే ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ అనుకుంటారు. ఏదైనా అనుకోవచ్చు. చక్కటి కథాంశంతో రూపొందింది. శరత్‌వాసుదేవన్‌ సంగీతాన్ని సమకూర్చారు. 'ఓరు' తర్వాత మంచి బాణీలు కుదిరాయి. హైదరాబాద్‌లో మూడురోజుల షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. ప్రస్తుతం అంతా క్రికెట్‌ సందడిలో ఉన్నారు. అవన్నీ పూర్తయ్యాక వేసవిలో సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: బాలబ్రహ్మన్, మాటలు: ఉమర్జీ కుమరన్, కథ - స్క్రీన్ ప్లే: శుభ, జయేంద్ర, దర్శకత్వం: జయేంద్ర

English summary
Siddharth says, “I’m happy to be back in Chennai doing 180 for my mentor and guru Jayendra, the noted ad filmmaker who is debuting as director with this urban cool film on relationships. It is my first pure bilingual in which every shot is canned twice. Some of the supporting actors for both the versions are different. The lead actors Nithya Menon, Priya Anand and me are the common factor in the film.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu