twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్ధార్థ 'బావ' చిత్రం స్టోరీ లైన్ ఏంటంటే...

    By Srikanya
    |

    రాముడు, సీతలాంటి బావా మరదళ్ల మధ్య రావణాసురుడిలాంటి ఓ పాత్ర ప్రవేశిస్తుంది. అతను పెట్టే సమస్యలను, అవరోధాలను హీరో ఎలా అధిగమించి తన మరదలుని దక్కించుకుంటాడన్నది ఈ చిత్ర కథాంశం అంటున్నారు దర్శకుడు రాంబాబు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రాజేంద్రప్రసాద్, సిద్ధార్థ నటిస్తున్నారు. అలాగే తన కొడుక్కి స్నేహితుడిలా, తండ్రిలా, గురువులా ఉంటూ, ఆ కొడుకు ప్రేమ కోసం రాజేంద్రప్రసాద్ ఏం చేశారన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి, కొడుకు ఇలాగే ఉండాలని కోరుకుంటారు అన్నారు.

    క్రింద లుంగీ, పైన తలకట్టు కట్టి ట్రాక్టర్ నడుపుతూ కనపడే అచ్చ తెలుగు రైతు పాత్రని రాజేంద్రప్రసాద్ పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ, ప్రణీత జంటగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మిస్త్తున్న 'బావ' చిత్రం ఐదో షెడ్యూల్ ఈ నెల 23 నుంచి అన్నవరంలో జరుగుతుంది. కీలక సన్నివేశాలతో పాటు మూడు పాటలు, ఓ ఫైట్, క్లైమాక్స్ ఛేజ్ చిత్రీకరిస్తాం. దీంతో ఓ పాట, ఫ్లాష్ ‌బ్యాక్, కొంత టాకీ మినహా చిత్రం పూర్తవుతుంది. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: చక్రి, ఫొటోగ్రఫీ: అరవింద్ కృష్ణ, సమర్పణ:సందీప్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X