»   » అవును, నాకు 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు : సిద్ధార్థ్

అవును, నాకు 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు : సిద్ధార్థ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ హీరో సిద్ధార్థ్ గురించి చాలా రోజులుగా రకరకాల పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ, సమంత పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు కూడా ఆ మధ్య వినిపించాయి. చాలా ఏళ్ల క్రితమే సిద్ధార్థకు పెళ్ళయిందని, భార్యతో విడాకులు పుచ్చుకుని, టీనేజ్ వయసున్న ఓ కొడుకుతో దూరంగా ఉంటున్నాడనే వార్తలు సైతం గతంలో వినిపించాయి.

ఇటీవల ఈ వార్తలపై సిద్ధార్థ స్పందించారు. 'ఇటువంటి గాలివాటం వార్తలకు నేను స్పందించడం మానేసాను. పదేళ్ళ క్రితం నా మీద ఇలాంటి వార్తలే వచ్చాయి. నాకు కొడుకు ఉన్నాడని కూడా కొందరు రాసుకొచ్చారు. నా వయసు ఇప్పుడు ముప్పయి అయిదు ఏళ్ళు దాటుతోంది. నేను నా పని తప్ప ప్రస్తుతానికి నాకు వేరే ధ్యాస లేదు. ఎప్పుడైతే నేను జీవితంలో సెటిల్ అవుతానో, అందరినీ పిలిచి మరీ అన్ని విషయాలు మాట్లాడతాను. అంతవరకు ఓపిక పట్టండి,' అని పేర్కొన్నాడు.

Siddharth reveals his son’s name

తాజాగా సిద్ధార్థ తనకు కొడుకు ఉన్నాడనే విషయం బయట పెట్టాడు. తన కొడుకు పేరు మోగ్లి అని అతని వయసు 10 సంవత్సరాలు అని పేర్కొన్నారు. అయితే మోగ్లీ సిద్ధార్థ సంతానం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అదో కుక్క. సిద్ధార్థ పెంపుడు కుక్క. ఓ స్లమ్ ఏరియాలో ఇది తనకు దొరికొందని, అప్పటి నుండే తన వద్దే పెరుగుతోందని, ఇదంటే తనకు ఎంతో ఇష్టమని సిద్ధార్థ చెప్పుకొచ్చారు. తన గురించి పుకార్లు ప్రచారం చేయడం మానుకోవాలని సిద్ధార్థ చెప్పుకొచ్చారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/1xBh2W6jwCM?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
‘Yes, I have a son. It is my pet dog Mowgli. He is 10-year-old and I found him near a slum’ Siddharth said.He asked media to stop gossiping about him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu