»   » సిద్దార్ధ, సమంత మరోసారి ...

సిద్దార్ధ, సమంత మరోసారి ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సమంత, సిద్దార్ద మరోసారి జత కట్టనున్నారు. ఇంతకుముందు వీరిద్దరు... 'జబర్దస్త్' సినిమాలో కలిసి నటించారు. అయితే ఈసారి వీరిద్దరూ నటిస్తుంది సినిమాలో కాదు, ఒక టి.వి యాడ్ లో. ఈ యాడ్ కోసం ఇటీవలే బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకున్నారు.ఎంతో మంది అందాలరాశులు మరియు స్టార్ హీరోలు ప్రచారకర్తలుగా నటించిన 'లక్స్' కు వీరు నియమింపబడ్డారు

ఈ విషయం సమంత చాలా ఆనందపడుతూ మీడియాకు తెలియజేసింది. చిన్నపట్నుంది తనని లక్స్ గర్ల్ అంటారని, ఆ కోరిక ఇలా తీరిందని చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో తనకు చాలా సహాయం చేసిన సిద్ధార్ధ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రచారచిత్రం నవంబర్ నుండి టి.వి లలో ప్రసారంకానుంది.

లక్స్ పాప అనిపించుకోవటం హీరోయిన్స్ ఓ పెద్ద ముచ్చట. హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత తాజాగా లక్స్( LUX ) ఇంటర్ నేషనల్ సబ్బు ఏడ్ కి మోడల్ గా ఎంపికయింది. బాత్ టబ్ లో అర్ధ నగ్నంగా కనపడుతూ సబ్బు నురుగలతో కనపడేందుకు ఆమెకు పెద్ద మొత్తమే ఇస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఎడ్వర్టైజ్ మెంట్ రీజనల్ ఛానెల్స్ లో త్వరలో రానుంది. ఇక నుంచి ఆమె అభిమానులు పదే పదే ఆమె సువాసనలును ఆఘ్రాణించవచ్చన్నమాట.

గతంలో శ్రీదేవి, ఐశ్వర్యా బచ్చన్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, అసిన్ లక్స్ ని ప్రమోట్ చేసారు. ఇప్పుడు సమంత వంతు వచ్చింది. దాంతో సమంత చాలా ఉషారుగా ఉంది. లక్స్ బేబి కావటం చాలా ఆనందం కలగచేస్తోందని చెప్తోంది. ప్రస్తుతం సమంత వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఆమె పూర్తి చేసిన అత్తారింటికి దారేది,అత్తారింటికి దారేది చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉంది.

సమంత ట్వీట్ చేస్తూ... " లక్స్ గర్ల్ కావాలని చిన్నప్పటినుంచి నా మనస్సులో ఉంది. లక్స్ యాడ్స్ కి నా అభిమాన తారలు మోడిలింగ్ చేయటం చూస్తూ పెరిగిన దాన్ని... నేను ఎంపిక కావటంతో నమ్మలేక నన్ను నేను గిల్లుకు చూసుకున్నాను..కలా..నిజమా అని ," అంది.

ఇక ఎన్టీఆర్, సమంత జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రానికి 'రభస' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'రభస' టైటిల్ ఫైనల్ కాదని....త్వరలోనే అసలు టైటిల్ ప్రకటిస్తారని సమంత తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమా షూటింగ్ ఈ రోజే మొదలైన విషయం కూడా సమంత వెల్లడించారు.

English summary
Lux is synonymous with film stars. The soap brand always relies on the star power of reigning queen of glamour world. Tollywood's top queen Samantha is the new brand ambassador for Lux.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu