twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్దార్ధ, శృతి హాసన్ లో ఫాంటసీ చిత్రం కథ ఇదే...

    By Srikanya
    |

    అంగరాజ్యంలో కన్నీటు బొట్టు ఆకారంలో ఉండే ఓ కాల్పనిక గ్రామంలో ఈ జానపద కథ జరుగుతుంది. క్షుద్రశక్తులతో అంగరాజ్యాన్ని నాశనం చేయాలని రాక్షస మహారాణి అనుకుంటుంది. ఆమె బారిన పడిన తొమ్మిదేళ్ళ పాపను కాపాడటానికి ఒక వీరుడు బయలుదేరతాడు. అతడి ప్రేయసి జిప్పీ వనిత. ఆఖరి పోరాటంలో విజయం ఎవరిని వరించిందన్న దిశలో కథనం నడుస్తుంది. సిద్ధార్థ్, శ్రుతి హాసన్ జంటగా ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

    కె.రాఘవేంద్రరావు సమర్పణలో వాల్ట్ డిస్నీ (ఇండియా) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రంలో మోహన్‌ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ఒక రాక్షస మహారాణి పాత్రలో నటిస్తోంది. 2009లో ఈ భారీ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 2011 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే భీమిలి, విశాఖ, రామోజీ ఫిలింసిటీలలో జరిగిన షెడ్యూళ్లలో భారీ సెట్స్‌లో షూటింగ్ జరిపారు. ఈ విషయాలను దర్శక, నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.

    దర్శకుడు ప్రకాశరావు మాట్లాడుతూ "నా ఊహల్లో వింత ప్రపంచం కనిపించినప్పటి అనుభూతి వర్ణించలేనిది. భీమిలి, విశాఖ పరిసరాలు, రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. వాల్ట్‌ డిస్నీ సంస్థ ఇప్పటిదాకా పలు విలక్షణమైన కథలకు తెరరూపమిచ్చింది. మా చిత్రం వాటన్నింటినీ మించేలా ఉంటుందన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం వాల్ట్ డిస్నీ సంస్థతో కలసి పనిచేయడం నాకెంతో గర్వకారణం. ఈ భారీ చిత్ర నిర్మాణానికి వాల్ట్ డిస్నీ సంస్థను మించిన మరో పార్ట్‌నర్ ఉండరనేది నా నమ్మకం' అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X