twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా వస్తే చెప్పుతో కొట్టండి.. నాకు పొగరైతే.. పడిపోతే ఏంటీ.. సిద్ధార్థ్ (ఇంటర్వ్యూ)

    By Rajababu
    |

    Recommended Video

    అలా వస్తే నన్ను చెప్పుతో కొట్టండి..!

    బొమ్మరిల్లు, నేను వస్తానంటే వొద్దంటానా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకొన్న సిద్ధార్థ్.. గత కొద్దికాలంగా సరైన సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. టాలీవుడ్ చాలాకాలంగా దూరమయ్యాడు. ఒడిదొడుకులుగా సాగుతున్న ప్రయాణం మధ్య తాజాగా గృహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

    హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన గృహం చిత్రంలో ఆండ్రియా జెర్మియా హీరోయిన్‌గా నటించింది. తమిళ్ ఘనవిజయం సాధించిన అవల్ చిత్రం తెలుగులో గృహంగా విడుదలవుతున్నది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ మీడియాతో ముచ్చటించారు. గృహం చిత్రం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి సిద్దార్థ్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

     సామాజిక కోణంలో హారర్ చిత్రం

    సామాజిక కోణంలో హారర్ చిత్రం

    గృహం చిత్రం వాస్తవ కథతో రూపొందించాం. హారర్ చిత్రాలంటే కామెడీగా మారిన ఈ రోజుల్లో ఒక మంచి హారర్ చిత్రం చూశామనే సంతృప్తిని కలిగిస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకుడిని భయపెట్టించడంతోపాటు మంచి అనుభూతిని ఇస్తుంది. కమర్షియల్ హంగులతో పాటు సామాజిక కోణం కూడా ఉండటం ప్రేక్షకులను సంతృప్తి పరిచే అంశం.

     చిన్న పిల్లలకు చూపించొద్దు

    చిన్న పిల్లలకు చూపించొద్దు

    గృహం చిత్రం సకుటుంబంగా చూసే చిత్రం కాదు. పిల్లలు అసలే ఈ చిత్రం చూడకూడదు. పిల్లలను థియేటర్లకు అనుమతించకూడదు. ఈ చిత్రంలో నటించిన ఓ పాపను కూడా సినిమా చూడటానికి నేను ఒప్పుకోలేదు.

     గృహం చిత్రం గుడికాదు..

    గృహం చిత్రం గుడికాదు..

    కుటుంబం అంతా వెళ్లడానికి ఈ చిత్రం గుడి కాదు. ఇది పక్కా హారర్ చిత్రం. మీరు ఈ మధ్యకాలంలో ఇలాంటి హారర్ చిత్రం చూసి ఉండరు. నేను సెన్సార్ బోర్డుకు ఏ సర్టిఫికెట్ ఇవ్వమని బలవంతం చేశాను. ఈ సినిమా అందరూ చూడాలని నేను ఆశపడటం లేదు. ఓ వర్గం ప్రేక్షకులు చూస్తే చాలు అనే ఫీలింగ్‌తో ఉన్నాను.

     బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం

    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం

    మిలింద్ రావు దర్శకత్వంలో వచ్చిన గృహం చిత్రానికి గిరిష్ అందించిన సంగీతం ప్రాణం లాంటింది. ఈ చిత్రానికి సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరాయి. కలర్ ప్యాటర్న్ బాగా తెరమీద బాగా ఆకట్టుకొంటున్నాయి. యూనిట్ అంతా టీమ్‌గా పనిచేస్తే ఎలాంటి ఫలితం సాధించవచ్చో అనేది గృహం చిత్రం నిరూపించింది.

     నేను ఎప్పుడూ పడిపోలేదు..

    నేను ఎప్పుడూ పడిపోలేదు..

    గతంలో ఒక రేంజ్‌లో ఉండి ఈ మధ్యకాలంలో పడిపోయాను అని అనడం సరికాదు. నాకు పొగరు అని అనుకొంటారు. కానీ అది నిజం కాదు. కొందరు అనుకునేది నేను పట్టించుకొను. జీవితంలో ఒడిదుడుకులు సహజం. ఇప్పుడు నేను నిర్మాతగా మారి గృహం సినిమా లాంటి ఒక బ్లాక్‌బస్టర్‌తో ముందుకు వచ్చాను. మరోసారి నేను చెత్త సినిమాతో మీ ముందుకు వస్తే చెప్పుతో కొట్టండి అని సిద్ధార్థ్ కొంత ఆవేశానికి గురయ్యాడు.

     యువ టాలెంట్‌ను ప్రోత్సహించాలి

    యువ టాలెంట్‌ను ప్రోత్సహించాలి

    టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరికి ఓ ఫ్లాట్‌ఫామ్‌ను అందించాలనే ఉద్దేశంతోనే నిర్మాతగా ఎందుకు మారాను. సంగీత దర్శకుడు గిరీష్‌ అద్భుతమైన టాలెంట్. టాలెంట్ ఉండటం సరికాదు.. అవకాశాన్ని చేజిక్కించుకోవడమే అసలు టాలెంట్. ఈ చిత్రానికి పనిచేసిన వారి సగటు వయస్సు 26 సంవత్సరాలలోపు వారే. నా వయసు 38 సంవత్సరాలు. నేనే ఈ సినిమాకు పనిచేసిన వారిలో పెద్దవాడిని.

     అనిశా విక్టర్ నటన సూపర్

    అనిశా విక్టర్ నటన సూపర్

    గృహం చిత్రంలో కీలక పాత్రలో నటించిన యువ నటి అనిశా విక్టర్ తొలిసారి కెమెరా ముందు నటించింది. అనీషా ప్రదర్శించిన నటన ఈ సినిమాకు హైలెట్. ఆమెను చాలా శారీరకంగా హింసించినంత పనిచేశాం. ఆమె అద్భుతమైన నటన ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.

     ప్రేక్షకుల టేస్ట్ మారుతున్నది..

    ప్రేక్షకుల టేస్ట్ మారుతున్నది..

    ప్రేక్షకుల అభిరుచి మారుతున్నది. మంచి సినిమాలకు ఆదరణ పెరుగుతున్నది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి చాలా గొప్పగా ఉంటుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి ఇండిపెండెంట్ సినిమాలను పెద్ద సక్సెస్ చేశారు. అవి నిర్మాతగా మారడానికి నాకు స్ఫూర్తి కలిగించాయి.

     అందుకే అర్జున్ రెడ్డి ఘనవిజయం

    అందుకే అర్జున్ రెడ్డి ఘనవిజయం

    పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే క్యాటగిరీ ఉండదు. బొమ్మరిల్లు సినిమాను కూడా అప్పట్లో చిన్న సినిమా అని ప్రచారం చేయడం నాకు నచ్చలేదు. సినిమా పరిశ్రమ అంతా ఓ వైపు వెళ్తుంటే.. నాకు నచ్చిన సినిమాలు చేయాలన్న ఉద్దేశంతో, ప్రేక్షకుల టేస్ట్‌పై అంచనా ఉండటం కారణంగానే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు ఘనవిజయం సాధించాయి. వాటిని చిన్న సినిమాలు అనకూడదు. ఇండిపెండెంట్ సినిమా అని అనాలి.

    అందుకే నిర్మాతగా మారాను.

    అందుకే నిర్మాతగా మారాను.

    ఒకప్పుడు చేతిలో కథ ఉంటే హీరో కోసం, నిర్మాత కోసం ట్రై చేయాల్సి వచ్చేది. అదంతా ఓ సంవత్సరమో లేదా రెండు సంవత్సరాలో పట్టేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే సినిమా తీసి హిట్ కొట్టవచ్చు. టెక్నాలజీ అంతగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నీకు నచ్చిన సినిమాను తీసుకో.. ఒకరి కోసం ఎదురు చూటడం ఎందుకు అని నా తల్లిదండ్రులు ఎప్పుడు నాతో అనేవారు. వారి సూచన ప్రకారమే నేను నిర్మాతగా మారాను.

    English summary
    Bommarillu fame Siddharth's Latest movie is Gruham. Andrea Jeremiah, Anisha Victor, Atul Kulakarni are the lead actors. Horror and suspense movie directred by Milind Rau, Music scored by Girishh. This getting ready for release which Siddharh him self acted and produced.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X