»   » హాట్ టాపిక్ : నోరు జారి ఇరుక్కున్న సిద్ధార్థ్

హాట్ టాపిక్ : నోరు జారి ఇరుక్కున్న సిద్ధార్థ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తెలుగు దర్శకులకు సృజనాత్మక సినిమాలు తీసే సత్తా లేదని సిద్దార్ద సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సినిమాలపై అతడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి. తెలుగు వారికి మంచి సినిమాలు చూడటం చేతకాదని, మాస్ మసాలా 'బొమ్మ'లనే పదే పదే చూస్తారని చులకనగా మాట్లాడాడు. 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌' సినిమా హిట్‌తో సొంత బ్యానర్‌ ఏర్పాటు చేసుకున్న సిద్దార్ధ్‌ ఆ సినిమా సక్సెస్‌ మీట్‌లో ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ట్విట్టర్ ద్వారా వాటిని తర్వాత ఖండించారు.

ఆయన వ్యాఖ్యల్లో (మీడియాలో వచ్చినదాన్ని బట్టి) పెద్ద హీరోల సినిమాలు, ప్రేమకథా చిత్రాలే తప్ప వైవిధ్యభరితమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేరని సిద్దార్థ్‌ అన్నాడు. ప్రయోగాత్మక సినిమాలకు టాలీవుడ్‌లో ఆదరణ లేదని విమర్శించాడు. టాలీవుడ్‌లో మంచి దర్శకులే లేరని తేల్చి పారేశాడు. కాసులు రాల్చే సినిమాలే తప్పా కళాత్మక సినిమాలు తీయడం టాలీవుడ్‌ దర్శకుల వల్ల కాదని లెక్చరిచ్చాడు.

బాలీవుడ్ లోనూ పరిస్థితి ఏమంత గొప్పగా లేదని చెప్పాడు. దక్షిణాది నటులను చిన్నచూపు చూస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ జాతీయ అవార్డ్‌ తీసుకున్న హీరోలనైనా బాలీవుడ్‌లో కొత్త ముఖాలుగానే చూస్తారని చెప్పుకొచ్చాడు. అందుకే బాలీవుడ్‌ వేస్టని, టాలీవుడ్‌కు టేస్ట్‌ లేదని, తమిళ పరిశ్రమ మాత్రం బెస్టని వెనకేసుకొచ్చాడు.

ఇక ప్రయోగాత్మక సినిమాలకు తమిళ చిత్ర పరిశ్రమ చిరునామా అని సిద్ధార్థ్ చెప్పాడు. వైవిధ్యభరిత సినిమాలను ఆదరించడంలో తమిళులు ఎప్పుడూ ముందుంటారన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు. 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌' సినిమాలో హీరోయిన్‌ హన్సిక కంటే అతిథి పాత్ర పోషించిన సమంత అద్భుతంగా నటించిందని కితాబిచ్చాడు. హన్సిక మాత్రం యావరేజ్‌గా నటించిందని పెదవి విరిచాడు.

అయితే సిద్దార్ద ఇదంతా మీడియా సృష్టే అని...అలాంటి మాటలు తను అనలేదని ట్విట్ చేసారు. ఆయన ట్వీట్ లో.. , " నేను తెలుగు ఆడియన్స్ గురించి తప్పుగా మాట్లాడానని రూమర్స్ వస్తున్నాయి. ఎన్నో సార్లు ఇంతకు ముందు చెప్పాను..నేను ఇలాగ ఉన్నానంటే కారణం తెలుగు ఆడియన్సే. ఫ్యాన్సే. నేను అలా మరిచిపోయి మాట్లాడే వ్యక్తిని కాదు. ఇప్పుడు కాదు..ఎప్పుడూ అలా మాట్లాడను. అలాంటిరూమర్స్ పట్టించుకోవద్దు.. .' అని ట్వీట్ చేసారు.

English summary

 Siddharth ran into a controversy. A section of media reported that he made some derogatory comments about the tastes of Telugu audiences. According to the reports, he made some comments against the Telugu film industry at the success celebrations of his current Tamil film Theeya Velai Seiyyanum Kumaru (Tamil version of 'Something Something') in Chennai on Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu