»   » నటుడుగా తీరింది.. ఇక అదే మిగిలింది : సిద్దార్ద

నటుడుగా తీరింది.. ఇక అదే మిగిలింది : సిద్దార్ద

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటునిగా స్థానం పొందాను. దర్శకునిగా కూడా నా టేస్ట్‌కు తగ్గట్టు చిత్రాలు తీసి నేను నేర్చుకున్న విద్యకు సార్ధకత తేవాలని, అందరి అభిమానాన్ని పొందాలని నా కోరిక అంటున్నారు హీరో సిద్దార్ద.రీసెంట్ గా ఆయన నటించిన '180"చిత్రం విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే తాను ఎంతసేపూ కొత్త దర్శకులతో చేయటమే కానీ పెద్ద దర్శకులతో ఎందుకు చేయలేదో వివరిస్తూ...పెద్ద దర్శకులు అచ్చమైన మాస్ చిత్రాలనే చేస్తున్నారు. హ్యూమన్ రిలేషన్స్, క్లాసికల్ చిత్రాలు వారు చేయడంలేదు.

వారు పూర్తిగా అటువైపే మొగ్గు చూపడంతో అటువంటి చిత్రాల్లో అవకాశాలు రావడంలేదు. నాకు మాస్ పాత్రలు సెట్ కావు. అందుకే వారు, నేను దూరంగానే ఉంటున్నామేమో అనిపిస్తుంది. అందుకే నాకు నప్పే పాత్రలే వస్తున్నాయి. అలాంటి వాటిల్లో బెస్ట్ ఎంచుకుని చేస్తున్నా అన్నారు. ఇక తాను ప్రస్తుతం... ఓ మై ఫ్రెండ్, 'ఆవకాయ్ బిర్యానీ" అనిష్‌తో ఒకటి, హిందీలో దీపామెహతా చిత్రం మరో రెండు చిత్రాలు ఒప్పుకున్నవి ఉన్నాయన్నారు.

English summary
Siddharth wants things to happen his way, while director is adamant about his ideas. There have been creative differences between the two.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu