twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భగ్గుమన్న హీరో సిద్దార్థ్... నిర్మాతపై నిప్పులు!, క్షమాపణ..

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తమకు కనీస సమాచారం ఇవ్వకుండా సినిమా విడుదల వాయిదా వేయడంపై హీరో సిద్ధార్థ్ భగ్గుమన్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తన పదునైన కామెంట్లతో నిర్మాతలపై నిప్పులు చెరిగారు. సిద్ధార్థ నటిస్తున్న తమిళ చిత్రం'జిగర్తాండ' ఈ నెల 25న విడుదల కావాల్సి ఉంది. అయితే నిర్మాత ఈ చిత్రాన్ని ఉన్నట్టుండి వాయిదా వేసారు. ఈ చిత్రం తెలుగులో 'చిక్కడు దొరకడు'గా విడుదల కాబోతోంది.

    దీనిపై సిద్దార్థ్ ట్విట్టర్లో స్పందిస్తూ....'డర్టీ గేమ్ ఆడుతున్నారు. మీరెవరైనా కానివ్వండి. చిత్రాన్ని ఆలస్యం చేస్తారేమోకానీ...ఆపలేరు. ఒక మంచి చిత్రం ఎప్పటికీ చచ్చిపోదు. దర్శకుడు కార్తీక్‌తో పాటు టీం మొత్తం కష్టపడి పని చేసాం. వాయిదా వేస్తున్నామనే విషయం మాకు చెప్పాలనే కనీస మర్యాద కూడా లేకుండా ప్రవర్తించారు' అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సిద్ధార్థ క్షమాపణలు చెప్పారు.

     Siddharth tweet about JIGARTHANDA

    'చిక్కడు దొరకడు' సినిమా విషయానికొస్తే....5స్టార్‌ ఆడియో అధినేత ఎస్‌.కదిరేశన్‌ సమర్పణలో శ్రీ మీనాక్షి క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కింది. ఈ చిత్రంలో సిద్దార్ధ, లక్ష్మీమీనన్‌ జంటగా నటిస్తున్నారు. తమిళ్‌లోనే కాక తెలుగులో కూడా తన మొదటి చిత్రంతోనే కమర్షియల్‌ సక్సెస్‌ని సాధించిన 'పిజ్జా' సినిమా దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ ఈ 'చిక్కడు దొరకడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. పిజ్జా మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌, అదే టీమ్‌ ఈ చిత్రానికి పని చేసారు.

    సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌లో మొదలై కర్నూలు రౌడీషీటర్స్‌ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్‌ అవుతుంది. ఆడియన్స్‌ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్‌ గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించారు.

    మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్‌, కెమెరా: సంతోష్‌ నారాయణ్‌, ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ మూవీస్‌), నిర్మాత: కదిరేశన్‌, దర్శకుడు: కార్తిక్‌ సుబ్బురాజ్‌.

    English summary
    "Karthik, our whole team and I worked really hard for Jigarthanda.With no respect for us, without even discussing it with us...postponed. Whoever you are who aided in this dirty game, you can delay us you cannot stop us. A good film cannot be killed." Siddharth tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X