»   » ‘బాద్‌షా’ లాంటి పాత్రలు మళ్లీ చేయను

‘బాద్‌షా’ లాంటి పాత్రలు మళ్లీ చేయను

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ :''తారక్, శ్రీనువైట్ల అడగడంతో చేయక తప్పలేదు. కథను కీలకమైన మలుపు తిప్పే పాత్ర కావడంతో చేశాను. మరోసారి అలాంటి పాత్రలు చేయను'' అని సిద్దార్ధ చెప్పారు. 'బాద్‌షా'లో ఎన్టీఆర్ స్నేహితుడుగా చిన్న పాత్ర చేసారు. ఎందుకంత చిన్న పాత్ర చేశారు? అనంటే ఆయన ఇలా సమాధానమిచ్చారు.

సిద్దార్థ్ , హన్సిక జంటగా నటించిన ద్విభాషా చిత్రం 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'. సుందర్.సి దర్శకుడు. బి.సుబ్రమణ్యం నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సిద్దార్థ్ మీడియాతో ముచ్చటించారు.

'సమ్‌థింగ్ సమ్‌థింగ్' సినిమా గురించి మాట్లాడుతూ- ''ఇందులో నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓ సందర్భంలో ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తా. ఆ అమ్మాయి నావైపు తిరిగి చూస్తుంది. అప్పుటి వరకూ 'ఓకే'. మళ్లీ రెండోసారి నావైపు తిరిగి చూడాల్సిన అవసరం ఆ అమ్మాయికి వస్తుంది. తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా. యువతరానికే కాదు, మా అమ్మకు కూడా ఈ సినిమా నచ్చుతుంది'' అన్నారు.

ప్రస్తుతం పిజ్జా ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్నానని, తర్వాత వసంతబాలన్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాలు తెరకెక్కుతాయని సిద్దార్థ్ తెలిపారు.

English summary
Siddharh,Hansika starrer ‘Something Something’ directed by C.Sunder is readying for release soon. B.Subrahamanyam is producing the film. Satya is the music director.
Please Wait while comments are loading...