»   » సమంతతో కేవలం ప్రెండ్‌షిప్‌ అంటున్నాడు

సమంతతో కేవలం ప్రెండ్‌షిప్‌ అంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : స్నేహానికి సమంత అనువైన అమ్మాయని కితాబిచ్చాడు యువ నటుడు సిద్దార్థ. చాలా గ్యాప్ తర్వాత సుందర్‌ సి దర్శకత్వంలో వచ్చిన 'సమ్ థింగ్..సమ్ థింగ్'తో విజయం అందుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల నా సినీ ప్రయాణానికి ఈ చిత్రం మరింత ఊపునిచ్చింది. ఈ నేపధ్యంలో సమంతతో తనకు లవ్ ఉందనే విషయంపై వస్తున్న వార్తలు గురించి మాట్లాడారు.

సిద్దార్ద మాట్లాడుతూ... నాతో కలిసి నటించిన హీరోయిన్స్ ల్లో జెనీలియా అంటే ఇష్టం. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా స్నేహం చేసేందుకు సమంత తగిన అమ్మాయి. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. నేను చేసుకునే అమ్మాయి సినిమా నటా, పారిశ్రామికవేత్త అన్న విషయాలను కాలమే నిర్ణయిస్తుంది అన్నారు.

అలాగే మళ్లీ సుందర్‌ సి దర్శకత్వంలో నటించే విషయం ఆయనే ఖరారు చేయాలి. మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించాను. నటనలో తీరికలేకుండా ఉన్నందున మెగాఫోన్‌ పట్టుకునే ఆలోచన లేదని చెప్పాడు.

ఇక సమంత ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ... తన పర్సనల్ లైఫ్ గురించి చర్చించింది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం ఒప్పేసుకుంది. 'అవును నేను ప్రేమలో ఉన్నాను' అని వ్యాఖ్యానించింది. అయితే తన ప్రియుడు ఎవరనే విషయం బయట పెట్టడానికి మాత్రం సమంత నిరాకరించింది. తన ప్రేమ వ్యవహారం పూర్తిగా ప్రైవేట్ మ్యాటరని, దాని గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ మరో మూడు సంవత్సరాల తర్వాత అని వెల్లడించింది.

English summary

 Siddharth trashes rumours with Samantha. He says she is the best friend to him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu