»   » సంక్రాంతికి అధ్యతిధిక బడ్జెట్ చిత్రం ఇదే

సంక్రాంతికి అధ్యతిధిక బడ్జెట్ చిత్రం ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాబోయే సంక్రాంతి బడ్జెట్‌ చిత్రాల్లో 32 కోట్ల రూపాయల అత్యధిక బడ్జెట్‌తో తీసిన చిత్రం 'అనగనగా ఓ ధీరుడు' అని నిర్మాతలు తెలిపారు. సిద్ధార్థ హీరోగా కమలహాసన్‌ కుమార్తె శృతిహసన్‌ కథానాయికగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిస్నీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.సూర్యప్రకాష్‌ దర్శకుడు. కె.రాఘవేంద్రరావు తనయుడైన ఈయనకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. కాగా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రాన్ని దాదాపు 350 ప్రింట్లతో 700 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వివరించారు. మనదేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 72 నిమిషాల నిడివిగల గ్రాఫిక్స్‌తో తెరపైన అద్భుతాలను సృష్టించడం జరుగుతుందని అన్నారు.

మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న ఓ కీలక పాత్రను పోషించారని, పాత్రల తీరుతెన్నులు కూడా వైవిధ్యంగా ఉంటాయని వారు చెప్పారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తూ ఓ కొత్త అనుభూతికి లోనవుతారని దర్శక, నిర్మాతలు తెలిపారు. నలుగురు సంగీత దర్శకులు, నలుగురు ఫైట్‌ మాస్టర్స్‌ ఈ చిత్రానికి పనిచేయటం ఓ విశేషమని అన్నారు. ఇటీవల విడుదలైన ఆడియోకు విశేషమైన ఆదరణ లభించిందన్నారు. అన్నివర్గాలతో పాటు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను, పిల్లల్ని విపరీతంగా ఆకట్టుకునేవిధంగా ఈ చిత్రం రూపొందిందని వారు తెలిపారు. ఇక శృతిహసన్‌ అందాలు కుర్రకారుని అలరిస్తాయని చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X