twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీసులతో గొడవ: తిక్కవరపు అవార్డు ఫంక్షన్... అంతా తిక్క తిక్కగానే!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నిర్మాత, రాజకీయవేత్త తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి(టీఎస్ఆర్) తను స్థాపించిన టీఎస్సార్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సినిమా వారిని పిలిచి అవార్డు ఫంక్షన్స్ నిర్వహిస్తున్న సంగతి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి వైజాగ్ లో ఫంక్షన్ చేసారు.

    ఈ అవార్డు ఫంక్షన్స్ ఏర్పాటు చేసేది సినిమా కళలపై, కళాకారులపై ఇష్టంతోనా? లేక తన పేరు, పలుకుబడి పెంచుకోవడానికా? అనే సంగతి పక్కన పెడితే.... తిక్కవరపు నిర్వహించిన ఈ ఫంక్షన్ తిక్కతిక్కగా సాగడం చర్చనీయాంశం అయింది.

    పద్దతి పాడు లేకుండా తిక్క తిక్కగా

    పద్దతి పాడు లేకుండా తిక్క తిక్కగా

    టీఎస్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్ ఆద్యంతం ఓ పద్దతి పాడూ లేకుండా తిక్క తిక్కగా సాగింది. ఫంక్షన్ చూస్తున్న వారంతా ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమం ఇలా అస్తవ్యస్తంగా జరుగడం చూసి ఆశ్చర్యపోయారు.

    ఇంత చెత్తగానా...

    ఇంత చెత్తగానా...

    ఈ అవార్డుల కార్యక్రమానికి సుమ యాంకరింగ్ చేసారు. అయితే సుబ్బిరామిరెడ్డి మధ్య మధ్యలో వచ్చి మైకు అందుకుని... పద్దతి పాడు లేకుండా `నువ్వు రా అవార్దు తీసుకో` అంటూ ప్రముఖులను వేదికపైకి పిలవడం సరిగాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    జ్యోతి ప్రజ్వలన

    జ్యోతి ప్రజ్వలన

    జ్యోతి ప్రజ్వలన లాంటి కార్యక్రమాలు కార్యక్రమం మొదలయ్యే సమయంలో జరుగుతాయి. అయితే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా సగం కార్యక్రమం అయ్యాక జ్యోతి వెలిగించడం లాంటివి చేసారు.

    అడ్డుకున్న పోలీసులు

    అడ్డుకున్న పోలీసులు

    విశాఖలోని పోర్టు స్టేడియలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోలీసులు పదిగంటల వరకే అనుమతి ఇచ్చారు. కానీ 10:30 దాటినా కార్యక్రమం కొనసాగిస్తుండడంతో పోలీసులు ఒక్కసారిగా స్టేజ్‌పైకి వచ్చి అడ్డుకున్నారు.

    పోలీసులతో గొడవ, ఉద్రిక్తత

    పోలీసులతో గొడవ, ఉద్రిక్తత

    ప్రియాంక చోప్రా కజిన్ మన్నారాచోప్రా పెర్ఫార్మెన్స్ అయిపోగానే పోలీసు అధికారి స్టేజ్‌పైకి వచ్చి మైక్ అందుకుని ‘‘క్షమించాలండి. ఇక్కడ పదిగంటల వరకే అనుమతిఇచ్చాం. ఇప్పుడు 10:40 అయ్యింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆపేస్తున్నాం'' అని అనౌన్స్ చేశారు. అయితే మన్నారా చోప్రా పెర్ఫార్మెన్స్ అనంతరం ఓ హిందీ సాంగ్‌కు మరో పెర్ఫార్మెన్స్ ఉండడంతో ‘‘చెయ్‌వయ్యా నువ్వు.. చెయ్ చెయ్.. కమాన్ డూ ఇట్.. కమాన్ స్టార్ట్.. స్టార్ట్'' అంటూ కంటెస్టెంట్స్‌ను కంటిన్యూ చేయమని సుబ్బిరామిరెడ్డి ఆదేశించారు.... దీంతో గొడవ లాంటి వాతావరణం, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

    తగ్గిన టీఎస్ఆర్

    తగ్గిన టీఎస్ఆర్

    అయితే వివాదం పెద్దగా చేయకుండా.... చివరకు సుబ్బిరామిరెడ్డే మైక్ అందుకుని ‘‘ఈ రోజు ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి కారణం పోలీస్ డిపార్ట్‌మెంటే'' అని ప్రకటించి కార్యక్రమాన్ని అంతటితో ముగించారు.

    పూర్తిగా ఇవ్వని అవార్డులు

    పూర్తిగా ఇవ్వని అవార్డులు

    అయితే అవార్డులు అందరికీ ఇవ్వడం పూర్తి కాక ముందే కార్యక్రమం అర్దాంతరంగా ముగిసింది. నిర్వహణ సరిగా లేక పోవడం వల్లే ఇలా జరిగిందని, హేమా మాలిని, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, కృష్ణం రాజు, జాకీష్రాఫ్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ హాజరైన ఈ ఫంక్షన్ ఇలా జరుగడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

    English summary
    Tsr TV9 awards event was held in Vizag yesterday. The event was a grand success with huge crowd turned up at the function. Following are the sidelights recorded during the awards ceremony.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X