»   » కత్రినా వాడిందనే అంత డిమాండు.... వేలం వేస్తారట

కత్రినా వాడిందనే అంత డిమాండు.... వేలం వేస్తారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెలబ్రిటీలూ... నేషనల్ హీరోలూ వాడిన వస్తువులని వేలం వేయటం మామూలే. అంతర్జాతీయంగా కూడా ఈ వేలాలు జరుగూతూంటాయి.సెలబ్రిటీలంటే అభిమానులకి చాలా ఆసక్తి ఎక్కువ. వారి నటనే కాదు సినిమాలో హీరో హీరోయిన్ లు వాడే వస్తువులకు కూడా మంచి క్రేజ్ నెలకొంది. దీనిని క్యాష్‌ చేసుకోవాలనుకున్న కొందరు నిర్మాతలు సినిమాలో స్టార్స్ వాడిన ప్రాపర్టీస్ ని వేలానికి వేస్తుంటారు.

ఇలా వచ్చిన మనీని కొందరు సోషల్‌ సర్వీస్ కోసం ఉపయోగిస్తుంటారు . ఇదే ట్రెండ్ మన దేశం లోనూ కొన్నేళ్ళ క్రితమే మొదలయ్యింది. తెలుగులోనూ మగధీర సినిమాలో వాడిన కత్తీ డాలూ వంటి వస్తువులు వేలం వేసిన సంగతి మనకు తెలిసిందే.

Sidharth and Katrina's 'Kala Chashmas' up for auction

తాజాగా బార్ బార్ దేఖో చిత్ర నిర్మాతలు కూడా వేలం వేసేందుకు రెడీ అయ్యారు . సినిమాలోని కాలా చష్మా అనే సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమాలో కత్రినా, సిద్ధార్ద్‌లు నల్ల కళ్ళద్ధాలతో కనిపించారు. ఆ అద్దాలకి కూడా మంచి క్రేజ్ ఉంది. సోషల్‌ మీడియాలో కొందరు ఆ అద్దాలను వేలానికి పెట్టాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారట. దీంతో చిత్ర బృందం కళ్ళద్ధాలను వేలం వేయడానికి రెడీ అయింది.

మరి ఈ అద్ధాలకు ఏ రేంజ్ లో ధర పలుకుతుందో చూడాలి. బార్ బార్ దేఖో చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ అద్దాల ఖరీదు మరీ అంత ఎక్కువేం కాదు 5000 లోపే కానీ ఇప్పుడా కళ్ళద్దాల కరీదు లక్షల్లో ఉండొచ్చు. ఎందుకంటే ఆ కళ్ళద్దాలు అందాల సుందరి కత్రినా వాడింది మరి. ఇక సిద్దార్థ కి కూడా మంచి క్రేజే ఉండటం తో బాగానే గిట్టుబాటయ్యే చాన్స్ ఉంది. అయితే ఈ వేలం లో వచ్చిన డబ్బులని దేనికోసం ఉపయోగిస్తారన్నది మాత్రం ఇంకా చెప్పలేదు.

English summary
Makers of "Bar Baar Dekho" have decided to put up the black sunglasses up for auction
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu