సైమా 2018 అవార్డుల వేడుకకు రంగం సిద్ధం
ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల వేడుక ఇటీవలే కన్నుల పండువగా ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలో సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ప్రారంభం కాబోతోంది. 7వ ఎడిషన్ సైమా అవార్డుల వేడుక ఈ సారి దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నారు.
'సైమా' నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 7, 8వ తేదీల్లో దుబాయ్‌లో వైభవంగా ఈ అవార్డుల వేడుక జరుగనుంది. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

ఈ అవార్డుల వేడుకలో వివిధ కేటగిరీల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులు ప్రధానం చేయబోతున్నారు. దీంతో పాటు సినీ రంగానికి విశిష్ఠ సేవలు అందించిన ప్రముఖులను సత్కరించనున్నారు. సౌత్‌లోని నాలుగు సినిమా పరిశ్రమలకు చెందిన తారలతో కలర్ ఫుల్‌గా ఈ వేడుక జరుగనుంది.
గతంలో నిర్వహించిన సైమా వేడుకలను తలదన్నేలా ఈ 7వ ఎడిషన్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. అన్ని సినిమా రంగాల నుండి పెద్ద పెద్ద స్టార్లు ఈ వేడుకకు హాజరయ్యేలా నిర్వాహకులు దృష్టి పెట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











