»   » ఉత్తమ నటుడు బాలయ్య...(సైమా అవార్డ్స్ 2015 ఫోటోస్)

ఉత్తమ నటుడు బాలయ్య...(సైమా అవార్డ్స్ 2015 ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ ఇండియా ఇంటర్నేషల్ అవార్డ్స్ 2015 కార్యక్రమం దుబాయ్ లో రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం సినీ పరిశ్రమలకు చెందిన తారల రాకతో అవార్డుల కార్యక్రమం సందడిగా సాగింది. ఆయా భాషలకు సంబంధించి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి ఇలా వివిధ విభాగాల్లో పలువురు స్టార్స్ అవార్డులు అందుకున్నారు.

తెలుగు విభాగానికి సంబంధించి నందమూరి బాలకృష్ణ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. గతేడాది వచ్చిన ‘లెజెండ్' చిత్రానికి గాను ఆయన ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ‘రేసు గుర్రం' చిత్రంలో పెర్ఫార్మెన్స్‌కి గాను హీరోయిన్ శృతి హాసన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.

ఇక అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, సమంత, శ్రీయ ప్రధాన తారాగణంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనం' చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికయింది.

రేసు గుర్రం చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా బ్రహ్మానందం, మనం చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా శ్రీయ, ఉత్తమ తొలి పరిచనడుగా సాయిధరమ్ తేజ్(పిల్లా నువ్వులేని జీవితం), ఉత్తమ తొలి పరిచయ నటిగా రాశీ ఖన్నా(ఊహలు గుసగుసలాడే), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్(మనం), ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్(కనిపించిన మాఅమ్మకే, మనం) అవార్డులు అందుకున్నారు. స్లైడ్ షోలో ఫోటోలు...

బాలకృష్ణ

బాలకృష్ణ


లెజెండ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగ అవార్డు అందుకుంటున్న బాలకృష్ణ

ఉత్తమ నటి

ఉత్తమ నటి


రేసుగుర్రం చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంటున్న శృతి హాసన్

నివాళి

నివాళి


ప్రముఖ నిర్మాత డి రామానాయుడికి నివాళులు అర్పిస్తున్న సినీ ప్రముఖులు.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్


పిల్లా నువ్వు లేని జీవితం చిత్రానికి గాను ఉత్తమ తొలి పరిచయ నటుడిగా అవార్డు అందుకుంటున్న సాయి ధరమ్ తేజ్

బ్రహ్మానందం

బ్రహ్మానందం


సైమా అవార్డుల వేడుకలో అవార్డు అందుకుంటున్న టాలీవుడ్ కామెడీ స్టార్ బ్రహ్మానందం.

అమలా పాల్

అమలా పాల్


సైమా అవార్డుల వేడుకలో హీరోయిన్ అమలా పాల్ డాన్స్ పెర్ఫార్మెన్స్.

నాగ చైతన్య

నాగ చైతన్య


మనం చిత్రం తరుపున అవార్డు అందుకుంటున్న నాగ చైతన్య.

శ్రీయ

శ్రీయ


సైమా అవార్డుల వేడుకలో శ్రీయ డాన్స్ పెర్ఫార్మెన్స్.

ఆందన బాస్ఫాలు

ఆందన బాస్ఫాలు


బ్రహ్మానందం ఆనంద బాష్పాలను తుడుస్తున్న బాలయ్య.

English summary
Check out SIIMA Awards 2015 Winners Photos.
Please Wait while comments are loading...