»   » తొలిసారి..లైవ్ లో స్టేజీపై చిరు డాన్స్ , వెనక ఇదే స్ట్రాటజీ

తొలిసారి..లైవ్ లో స్టేజీపై చిరు డాన్స్ , వెనక ఇదే స్ట్రాటజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్ : చిరంజీవి అంటే డాన్స్ లు, కేవలం ఆయన డాన్స్ కోసం సినిమాలు చూసేవాళ్లు కూడా ఉండేవాళ్లు. అయితే ఈ మధ్యన గ్యాప్ వచ్చింది. చిరంజీవి పొలిటికల్ లైఫ్ లో బిజీ అయ్యి, సినిమాలను ప్రక్కన పెట్టారు.అదే సమయంలో తనకు పేరు తెచ్చిపెట్టన డాన్స్ ను కూడా. అయితే ఆయన తొలిసారి లైవ్ ఫర్మామెన్స్ ఇవ్వనున్నారు.

ఈ సంవత్సరం సైమా అవార్డు ఫంక్షన్ లో భాగంగా గెస్ట్ గా వెళ్లడమే కాకుండా లైవ్ ఫర్మామెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.కత్తిలాంటోడుతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్‌తో ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా డ్యాన్స్‌ చేస్తారని తెలుస్తోంది. ఆ డాన్స్ కోసం ఆయన చాలా ప్రాక్టీస్ చేసారని చెప్తున్నారు. ఆ స్టెప్స్ సెన్షేషన్ గా ఉండాలని డాన్స్ మాస్టర్స్ తో చర్చించి, రోజులు తరబడి ప్రాక్టీస్ చేసి మరీ స్టేజ్ ఎక్కనున్నారట.

అయితే ఇన్నాళ్ళూ స్టేజ్ ఫెరఫార్మెన్స్ లకు దూరంగా ఉన్న చిరు, హఠాత్తుగా ఇలా తన డాన్స్ విశ్వరూపం మరోసారి చూపాలని ఎందుకు ఆసక్తి చూపుతున్నారు అంటే...ఆ స్టేజీని తన రీ ఎంట్రీకు వేదికగా చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. తనలో కానీ తన డాన్స్ లలో కాని కొద్దిగా కూడా తగ్గలేదని చెప్పటానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి.

SIIMA Pays A Bomb for Mega Star's Dance

చిరంజీవి...ఈ వయస్సులో సినిమా చేస్తున్నాడంటే రకరకాల అనుమానులు ఉంటాయని, వాటిని పటాపంచలు చేయటానికే ఇలా లైవ్ ఫెరఫార్మెన్స్ ఆలోచన అని తెలుస్తోంది. ఇప్పటికే బయిటకు వస్తున్న చిరంజీవి లుక్స్ ఆయన యంగ్ గా ఉన్న రోజులను గుర్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరో ప్రక్క ఈ ఫంక్షన్‌లో చిరు తన 150వ సినిమా ప్రమోట్‌ చేస్తారని సమాచారం. ఇందులో బాగంగా చిరంజీవి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసే పనిలో సైమా పడ్డట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా చిరు డ్యాన్స్ ను మిస్ అవుతున్న మెగా అభిమానులకు పండగే.
ఇంతకుముందు సినీ పరిశ్రమ వైజాగ్ హుద్ హుద్ భాధితుల కోసం నిర్వహించిన మేము సైతం ప్రోగ్రామ్ లో చిరు అనుకోకుండా కాలు కదిపినందుకు చాలా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ రేంజిలో రెచ్చిపోతారో చూడాలి.

ఈ ఏడాది సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్‌నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రదానోత్సవ కార్యక్రమానికి సింగపూర్ వేదికకానుంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీల నుంచి సుమారు 100మంది సినీ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ అవార్డ్ ల కోసం వచ్చిన నామినేషన్స్ ని ఎనౌన్స్ చేసారు. ఆ నామినేటెడ్ చిత్రాల వివరాలు క్రింద చూడండి.

English summary
This year's SIIMA have done the unthinkable and roped in mega star Chiranjeevi to attend the event this June end. Chiru will be performing live on stage for the first time in an award function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu