twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అమితాబ్‌' పై క్రిమినల్ కంప్లైంట్

    By Srikanya
    |

    బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కొద్దిరోజులలో ఆస్ట్రేలియాలో గౌరవ డాక్టరేట్‌ స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అమెరికాలోని ఒక సిక్కుమానవహక్కుల గ్రూపు ఆయనపై క్రిమినల్‌ ఫిర్యాదు దాఖలు చేసింది. 1984 నాటి సిక్కుల ఊచకోత సంఘటనను ఆయన ప్రేరేపించినట్లు ఆరోపించింది. ఆస్ట్రేలియా లోని కామన్‌వెల్త్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ క్రైగ్‌కు సి ఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌(ఎస్‌ఎఫ్‌జె) ఫిర్యాదు దాఖలు చేసింది. ఆస్ట్రేలియా క్రిమినల్‌ కోడ్‌ చట్టం-1995 కింద ఈ ఫిర్యాదు దాఖలైంది. ఈ చట్టం కింద ఆస్ట్రేలియాలో నేరం జరగకపోయినప్పటికీ మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై ఆస్ట్రేలియన్‌ కోర్టులు విచారించే అధికారం ఉంది. బ్రిస్‌బేన్‌ లోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ గురువారం అమితాబ్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది. ఇక ప్రస్తుతం అమితాబ్..రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న డిపార్టమెంట్ చిత్రంలో చేస్తున్నారు.

    పోలీస్ డిపార్టమెంట్ నేపధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తెలుగు హీరో రాణా, లక్ష్మీ ప్రసన్న మంచు కూడా నటిస్తున్నారు.అలాగే సంజయ్ దత్ కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చేస్తున్నారు.ఇంతకుముందు అమితాబ్ చేసిన బుడ్డా చిత్రం మంచి విజయం సాధించింది.ఈ చిత్రంతో పూరీకి బాలీవుడ్ లో మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. బుడ్డా ఆయన రిటైర్డ్ గ్యాంగస్టర్ గా కనిపించి తన అభిమానులను అలరించారు.ఆయన్ని మీరు సంతకం పెట్టిన, పెట్టాల్సిన సినిమా ప్రాజెక్టుల వివరాలు చెబుతారా అడిగితే రీసెంట్ గా... ఒక్క మాటగా చెప్పాలంటే ఏ కొత్త సినిమా కోసం నేను సంతకం పెట్టలేదు. అయితే చాలా ప్రాజెక్టులు చర్చల స్థాయిలో ఉన్నాయి. అవన్నీ ఒక కొలిక్కి వచ్చేంతవరకు వాటి గురించి మాట్లాడటం బాగుండదు అన్నారు.

    English summary
    A US-based Sikh human rights group lodged a criminal complaint against film star Amitabh Bachchan with Australia's commonwealth director of public prosecutions for "inciting, participating, conspiring, aiding, abetting and carrying out organized attacks on the Sikh population of India in November 1984".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X