»   » యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ హిట్ ‘డార్లింగ్’ 100 డేస్ సెంటర్స్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ హిట్ ‘డార్లింగ్’ 100 డేస్ సెంటర్స్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అదుర్స్" అనిపించే రేంజ్ లో హంగామాలేం చెయ్యకున్నా 'సింహా" సినిమా స్థాయిలో రికార్డుల హడావిడి లేకున్నా వాటి సరసన సగర్వంగా నిలిచే రీతిలో సైలెంట్ సక్సెస్ సాధించిన చిత్రం 'డార్లింగ్". యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, క్యూట్ గర్ల్ కాజల్ ల కాంబినేషన్ తో కరుణాకరన్ దర్శకత్వంలో బివిఎస్ ప్రసాద్ నర్మించిన 'డార్లింగ్" ఏప్రిల్ 23న విడుదలై అటు నిర్మాతకీ ఇటు బయ్యర్స్ కీ ప్రాపిట్స్ అందించిన శతదినోత్సవ చిత్రంగా నిలిచింది.

జూలై 31కి ఏకంగా 15 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంటోన్న 'డార్లింగ్" విజయం పై చిత్ర నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ స్పందిస్తూ..'మా బేనర్ లో తీసిన 'ఛత్రపతి" డార్లింగ్" చిత్రాల ద్వారా ప్రభాస్ తో వరుసగా రెండు హిట్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా వుంది. త్వరలోనే మా కాంబినేషన్ లో హ్యాట్రిక్ ఫిల్మిం కి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu