twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సిల్క్ స్మితను అక్కడే ఉంచి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు శారీరకంగా హింసించేవారు’

    |

    Recommended Video

    Heart Melting Facts Revealed About Actress Silk Smitha || Filmibeat Telugu

    ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఐటం గర్ల్‌గా, నటిగా పాపులర్ అయిన సిల్క్ స్మిత అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్‌గా ఎదిగారు. అయితే కొన్ని కారణాల వల్ల మానసికంగా కృంగిపోయిన ఆమె ఆత్మహత్య హత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్మిత అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లడానికి గల కారణాలను ఆ సమయంలో ఆమె జీవితాన్ని దగ్గరుండి పరిశీలించిన సినీ పరిశోధకులు ఇమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. అపర్ణ అనే క్యారెక్టర్ ఆర్టిస్టు ఇంట్లో పని మనిషి. సినిమా పిచ్చితో ఏలూరు నుంచి మద్రాస్ వచ్చింది. అపర్ణ ఇంటికి వచ్చే సినిమా వాళ్లు విజయలక్ష్మిని చూసి ఓ సినిమాలో చిన్న క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. ఆమె అందం, నటన నచ్చడంతో తమిళ, తెలుగు సినిమాల్లో అందరూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. పేరు కూడా సిల్క్ స్మితగా మార్చుకుందని తెలిపారు.

    ఆమెను శారీరకంగా హింసించేవారు

    ఆమెను శారీరకంగా హింసించేవారు

    సిల్క్ స్మితకు పొగరుబోతు అనే పేరు ఉంది. ఆమె అలా మారడానికి కారణం మొదట్లో చాలా అవమానాలకు గురి కావడమే. తెలుగులో తక్కువ కానీ... తమిళంలో దారుణంగా చేసేవారు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆవిడకు బండి లేకుండా చేసి అక్కడే ఉంచేవారు. ప్రొడక్షన్ వాళ్లు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవారని రామారావు తెలిపారు.

    నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్లు కూడా..

    నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్లు కూడా..

    ప్రొడ్యూసర్లు సాయంత్రం కాగానే అందరీ పంపించేసి సిల్క్ స్మితను మాత్రమే ఉంచండి అనేవారు. కాటేజీల్లో కూర్చోబెట్టి స్నాక్స్ తిందాం అని రెండు పెగ్గులు వేయించేవారు. ఆ తర్వాత జరుగకూడనిది జరిగేది. నిర్మాత కక్కుర్తి పడటంతో పాటు... ఫైనాన్సియర్, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగదోసేవాడు. అపుడు వారిని ఎదురు ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు. అవన్నీ మనసులో ఉంచుకునేది. అవకాశం వచ్చినపుడు పగతీర్చుకునేది.

    తన గుండెలో బాధ చెప్పుకుని బాధపడేది

    తన గుండెలో బాధ చెప్పుకుని బాధపడేది

    తనను మానసికంగా, శారీరకంగా హింసించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను ఎందుకు ఖాతరు చేయాలి? ఒక ప్రొడ్యూసర్ వల్ల తను నష్టపోయిందంటే వారి మొహం చూసేది కాదు, వారితో మాట్లాడేది కాదు. ఆ డిస్ట్రిబ్యూటర్ వస్తే రానిచ్చేది కాదు. వాళ్లు ఎంత హింస పెట్టారో, టార్చర్ పెట్టారో ఏం చెప్పమంటారండీ.. అవన్నీ గుండెల్లో మంటలు. సినిమా తార అవ్వాలంటే ఇవన్నీ తట్టుకోవాలని ప్రిపేర్ అయ్యే వచ్చాం. ఎంత ప్రిపేర్ అయినా ఊహించింది వారు మన వద్దకు వచ్చి శారీరకంగా హింసిస్తే ఎలా అని తన బాధను వ్యక్తం చేసేదిని రామారావు గుర్తు చేసుకున్నారు.

    రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ చేసేవాడు

    రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ చేసేవాడు

    ఒక పక్క ఊహించనిది ఏదో జరిగిందని బాధ పడుతుంటే.. దాన్ని పట్టుకుని ఆమెకు సన్నిహితంగా ఉండే రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ చేసేవాడు. నువ్వు పెద్ద పతీత్ అన్నావు, నన్ను నమ్మాను అన్నావు. నాకు తెలియకుండా ఇన్ని చేస్తున్నావు అని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇలాంటి కష్టాలు ఆమె ఆత్మహత్య వైపు ప్రేరేపించాయని రామారావు తెలిపారు.

    డబ్బు ఉన్నా సుఖం, మనశ్శాంతి లేదని బాధపడేది

    డబ్బు ఉన్నా సుఖం, మనశ్శాంతి లేదని బాధపడేది

    డబ్బుంటే సుఖం ఉంటుందనుకున్నాను కానీ ఈ డబ్బు ఈ రోజు సుఖం ఇవ్వలేదు, మనశ్శాంతి ఇవ్వలేదు అని బాధడేది. ఈ పరిణామాలే ఆమెను మానసికంగా కృంగదీశాయి. స్మిత బాగోగులు చూసుకుంటానన్న వంకతో ఆమె పంచన చేరిన రాధాకృష్ణ కు భార్య వున్నా సరే చేరదీసింది. అతడి వల్ల కూడా ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైందని రామారావు గుర్తు చేసుకున్నారు.

    అప్పట్లో రోజుకు లక్షల్లో

    అప్పట్లో రోజుకు లక్షల్లో

    ఆమె స్టార్ డమ్‌లో ఉన్నపుడు రెమ్యూనరేషన్ డిఫరెంటుగా ఉండేది. సినిమా రెమ్యూనరేషన్ కాకుండా ఏ రోజు రెమ్యూనరేషన్ ఆరోజే. ఆమె డేట్స్ కావాలంటే 4 లేదా 5 లక్షలు పట్టుకుని ఉదయం ఇచ్చి ఆమెను తీసుకెళ్లేవారు. ఆ డబ్బు రాధాకృష్ణకు బ్యాంకులో వేయాలని ఇచ్చేదని రామారావు తెలిపారు.

    English summary
    "Silk Smitha physically and mentally tortured by Producers and Distributors." said Film researcher Imandi Ramarao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X