»   » శింబు రజనీ గెటప్‌.. ఇక అంతా మంచే.. మాజీ ప్రియుడికి ప్రేమతో నయన

శింబు రజనీ గెటప్‌.. ఇక అంతా మంచే.. మాజీ ప్రియుడికి ప్రేమతో నయన

Posted By:
Subscribe to Filmibeat Telugu

శింబూ ఇక మున్ముందు నీకు మంచిరోజులే ఉన్నాయి. సూపర్ బ్లాస్ట్ ఇయర్ ముందుంది. హ్యాపీ బర్త్ డే అంటూ అందాల తార నయనతార ట్వీట్ చేసింది. గతంలో శింబు, నయనతార ఇద్దరు గాఢంగా ప్రేమించుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా కాలం తర్వాత వీరిద్దరూ సుందరుడు చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా శింబు, నయనతారల మధ్య విభేదాలు తొలిగిపోయి వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తున్నది.

నేడు శింబు 32వ జన్మదినం

నేడు శింబు 32వ జన్మదినం

మన్మథుడు, తదితర చిత్రాలతో ఓ దశలో అగ్రనటుడిగా దూసుకుపోతున్న శింబూకు ఊహించిన విధంగా కెరీర్ గ్రాఫ్ దిగజారింది. నయనతార దూరం కావడం, సినిమాలు సరిగా ఆడకపోవడంతో రేసులో వెనుకబడిపోయాడు. తాజాగా అంబనవన్ అసరాధవన్ అదంగధన్ (ఏఏఏ) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ తో కలిసి శింబూ శుక్రవారం తన 32వ జన్మదినాన్ని జరుపుకొన్నారు.

ఏఏఏలో త్రిపాత్రాభినయంతో కసిగా..

ఏఏఏలో త్రిపాత్రాభినయంతో కసిగా..

ఏఏఏ చిత్రంలో శింబూ మూడు పాత్రలను పోషిస్తున్నారు. మూడు పాత్రల్లో ఒకటి మధుర మైఖేల్ కాగా, రెండోది అశ్విన్ థాథా. మూడో పాత్ర అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. అశ్విన్ థాథాకు సంబంధించిన ఫొటోను జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో అశ్విన్ థాథా క్యారెక్టర్ దుమ్ము రేపుతుందనే అభిప్రాయాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

రజనీకాంత్ గెటప్‌లో శింబు

రజనీకాంత్ గెటప్‌లో శింబు

చాలా కాలంగా సరైన హిట్ లేకుండా డీలా పడిన శింబూ ప్రస్తుతం ఏఏఏ సినిమాను కసితో చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలోని అశ్విన్ థాథా క్యారెక్టర్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గెటప్ ను పోలి ఉండటం అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నది. ఇటీవల మధుర మైఖేల్ పాత్రతో ఉన్న టీజర్ కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంబనవన్ అంటే మంచి, చెడులను చూసుకొనే వ్యక్తి అని, అసరాధవన్ అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చలించని వ్యక్తి అని, అదంగధన్ అంటే బెదిరిపోని వ్యక్తి అని అర్థం.

మాస్, కామెడీతో హిట్ కొట్టేందుకు

మాస్, కామెడీతో హిట్ కొట్టేందుకు

కామెడీ, మాస్ అంశాలతోపాటు పక్కా కమర్షియల్ పంథాలో సాగే ఈ చిత్రంలో శింబు సరసన తమన్నా భాటియా, శ్రియా శరన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ ఇన్ఫోటైన్ మెంట్ పతాకంపై మైఖెల్ రాయప్పన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శింబూ మళ్లీ తమిళ తెరపై సంచలన విజయాన్ని అందుకొంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

English summary
He’s unconventional, talented and widely popular in Kollywood cinema. Currently acting in Anbanavan Asaradhavan Adangadhavan (AAA). He’s playing three distinct characters Madura Michael, Ashwin Thatha and an undisclosed third character.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu