»   » సూసైడ్ అటెమ్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటీతో నా పెళ్లా? భగ్గుమన్న హీరో శింబు..

సూసైడ్ అటెమ్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటీతో నా పెళ్లా? భగ్గుమన్న హీరో శింబు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటి ఓవియా...ఇపుడు తమిళ మీడియాలో ట్రెడింగ్ టాపిక్. గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో ఈవిడ పేరు మార్మోగిపోతోంది. అందుకు కారణం 'బిగ్ బాస్' ఇంట్లో ఆమె సూసైడ్ అటెమ్ట్ చేయడమే. ఈ సంఘటనతో తమిళ బిగ్ బాస్ షో మరింత వివాదాస్పదంగా మారింది.

ఇప్పటికే తమిళ సాంప్రదాయాలు, తమిళ ప్రజల మనోభావాలను కించపరిచేలా బిగ్ బాస్ షో సాగుతుందని జరుగుతున్న ఆందోళనకు తోడు ఓవియా వ్యవహారంతో వివాదం మరింత ముదిరింది. బిగ్ బాస్ షో వెంటనే నిలిపి వేయాలని ఆందోళనలు ప్రారంభమయ్యాయి. కొందరు కేసులు కూడా పెట్టారు. ఓవియా వ్యవహారం ఇపుడు హీరో శింబుకు కూడా తలనొప్పిగా మారింది.

శింబును వివాదంలోకి లాగారు

శింబును వివాదంలోకి లాగారు

ఓవియా వ్యవహారంలో హీరో శింబు పేరు వినిపించడం చర్చనీయాంశం అయింది. ఆమెకు తన మద్దతు ఇస్తున్నానని, ఆమెను పెళ్లాడతానని శింబు చెప్పినట్లు తమిళ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ వార్తలు చూసి శింబు అప్ సెట్ అయ్యారు.

Breakup : Who's Next Followed By Vignesh Shivan, Simbu, Prabhudeva - Filmibeat Telugu
భగ్గుమన్న శింబు

భగ్గుమన్న శింబు

ఈ వార్తలు విన్న శింబు భగ్గుమన్నారు. తాను ఓవియాను పెళ్లాడబోతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదని, ఎవరో నా పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ల ద్వారా ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వార్తలు నమ్మ వద్దని ఆయన మీడియా ముఖంగా ప్రకటన చేశారు.

నాపై కావాలని దుష్ప్రచారం

నేనంటే గిట్టని కొందరు చాలా కాలంగా చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇపుడు ఓవియా వ్యవహారంలో కూడా వారి హస్తం ఉందని భావిస్తున్నాను. దయచేసి ఇలాంటి వార్తలు నమ్మ వద్దు అని శింబు కోరారు.

నోరు మెదపని ఓవియా

నోరు మెదపని ఓవియా

ఇంత జరుగుతున్నా ఓవియా మాత్రం అసలు నోరు మొదపడం లేదు. హత్మహత్యాయత్నం తర్వాత హెల్త్ సమస్య కారణంగా బిగ్ బాస్ ఇంటి నుండి తానంతట తానుగా ఎగ్జిట్ అయిన ఆమె చికిత్స తీసుకుంటున్నారు. మీడియాకు దూరంగా ఉంటున్నారు.

శింబు వార్నింగ్

శింబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసింది ఎవరో నాకు తెలుసు. వారికి ఇదే నా ఫైనల్ వార్నింగ్. వారికి తగిన బుద్ది చెబుతాను అని శింబు వ్యాఖ్యానించారు.

English summary
Oviya left the Bigg Boss Tamil show citing health issues. After her exit, a tweet from one of Simbu's fake accounts said that he wanted to marry Oviya. The tweet was widely circulated on the internet. So much so that some section of media carried an article based on the tweet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu