»   » ఎన్టీఆర్ కు శింబు దెబ్బ కొట్టాడు

ఎన్టీఆర్ కు శింబు దెబ్బ కొట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఇప్పుడు అందరి టాలీవుడ్ స్టార్ హీరోల దృష్టి తమిళంలో మార్కెట్ పెంచుకోవటం పై పడింది. అయితే అక్కడ డబ్బింగ్ జరగకుండా రీమేక్ అయినప్పుడు మాత్రం హీరోలకు కలిసి వచ్చేదేమి ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్ కు అలాంటిది దెబ్బే పడింది.

'ఇది దయాగాడి దండయాత్ర' అంటూ అదరకొట్టిన ఎన్టీఆర్ హిట్ సినిమా టెంపర్ ఇప్పుడు తమళంలోకి రీమేక్ అవుతోంది. మొదట ఈ చిత్రాన్ని అక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తారని భావించారు. అయితే శింబు ఈ చిత్రాన్ని రీమేక్ చేయటానికి ఆసక్తి చూపటంతో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కావటం లేదు.

పూర్తి వివరాల్లోకి వెళితే..పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, కాజల్‌ నటించిన సినిమా 'టెంపర్‌'. పాండిరాజ్‌ దర్శకత్వంలో శింబు నటించిన 'ఇదు నమ్మ ఆళు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్‌లో తెరపైకి తీసుకురానున్నారు.

Simbu to star in the Tamil remake of Temper

ప్రస్తుతం ఆయన గౌతంమేనన్‌ దర్శకత్వంలో 'అచ్చం ఎన్బదు మడమయడా' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే 'టెంపర్‌' రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌' రీమేక్‌ హక్కులను నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాను శింబుతో చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టమైంది. శింబుతో 'వాలు' చిత్రాన్ని రూపొందించిన విజయ్‌చందర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ ఆఖరివారంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశముంది. మొత్తానికి 'దయాగాడి దండయాత్ర'ను తమిళనాడులో కూడా సాగించేందుకు శింబు సిద్ధమయ్యారు.

English summary
Michael Rayappan has acquired the Tamil remake rights of Temper. As of now, Simbu and Vijay Chandar are on board. The makers are yet to take a call on the rest of the cast and crew.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu