ఈ నెల 18న అగ్నిపరీక్షకు సిద్ధం అవుతున్న 'సింహా'
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా సింహా. నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను బోయపాటి శ్రీను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 18న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా చక్రి ఈ సినిమా ద్వారా తొలిసారి ఓ స్టార్ హీరో సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫ్లాపులతో సతమతమవుతున్న బాలయ్య, చక్రి లకు ఈ సినిమా ఓ అగ్నిపరీక్ష లాంటిదే. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూలేనంత గ్లామరస్ గా కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమా బాలయ్య మ్యానరిజానికి సరిగ్గా సరిపోతుందని ఖచ్చితంగా ఘనవిజయాన్ని సాధిస్తుందని దర్శకుడు అంటున్నాడు. మరి ఈ సినిమా పాటలు, సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందా.
సింహా బాలకృష్ణ నయనతార నమిత స్నేహా ఉల్లాల్ బోయపాటి శ్రీను balakrishna simha nayantara namitha sneha ullal chakri boyapati srinu


Click it and Unblock the Notifications