»   » సింహా ఎఫెక్ట్...మరో సినిమా ఫోస్ట్ ఫోన్

సింహా ఎఫెక్ట్...మరో సినిమా ఫోస్ట్ ఫోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ సింహా చిత్రం వరస హౌస్ ఫుల్స్ తో కలెక్షన్స్ కుమ్ముతూంటే వెనక రిలీజవుదామనుకున్న చిత్రాలు వాయిదా పడుతున్నాయి. ముందుగా దిల్ రాజు తన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాన్ని వాయిదా వేసి మే 12న ఈ చిత్రం విడుదల అవుతుందని ప్రకటన చేసారు. అయితే మెదట అనుకున్న ప్రకారం రామ రామ కృష్ణ కృష్ణ...మే 7న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే డిఐ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, అందుకే పోస్ట్ ఫోన్ చేస్తున్నారని దిల్ రాజు చెప్పారు. అదే రూటులో ఇ ప్పుడు లగడపాటి శ్రీధర్ తన స్నేహ గీతం చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. మే ఏడున రిలీజవుతుందని ప్రకటించిన ఈ చిత్రం మే ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది. అలాగే మరిన్ని చిత్రాలు కూడా తమ రిలీజులను ముందుకు జరుపుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఈ శుక్రవారం రిలీజైన సింహా..చాలా కాలం తర్వాత బాలయ్యకు హిట్ ఇచ్చి రిలీఫ్ ని ఇచ్చింది. ఈ చిత్రంతో దర్శకుడు బోయపాటి శ్రీను స్టార్ డైరక్టర్ గా మారారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu