»   » గుంటూరులో సింహా’ గర్జన మారు మ్రోగుతోంది!

గుంటూరులో సింహా’ గర్జన మారు మ్రోగుతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బోయపాటి శ్రీను దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మాణంలో యూనైటెడ్ మూవీ బ్యానర్ లో రూపొందిన బాలకృష్ణ తాజా చిత్రం 'సింహా" లో హింస ఎక్కువైందని, అతి అవధులు దాటిందనీ..సింహా చూసిన ప్రేక్షకులు వారి వారి అభిప్రాయాలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే 'సింహా" జోరుని అవేమీ అడ్డుకోలేకపోతున్నాయి. నాలుగు రోజులుగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోన్న 'సింహా" ప్రత్యేకించి గుంటూరులో పంజా దెబ్బ చూపిస్తోంది. ఇప్పటికే తొలి రోజు రికార్డుని హస్తగగం చేసుకున్న 'సింహా" ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డు మీద కన్నేసింది.

గుంటూరు జిల్లాకి నాలుగు కోట్లు వసూలు చేసి కనీవినీ ఎరుగని రికార్డుని 'మగధీర" నెలకొల్పితే..'సింహా" ఆ దిశగా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగురోజలకే ఇంతటి రెస్పాన్స్ ఎప్పుడూ చూడలేదని పలువురు వ్యక్తం చేస్తున్నరు. అనధికార సమాచారం ప్రకారం 'సింహా" ని నాలుగు కోట్లకి అవుట్ రైట్ కొనడానికి కొందరు ఉత్సాహం చూపుతున్నారని తెలుస్తోంది. అంటే లాంగ్ రన్ లో 'సింహా" నాలుగు కోట్లకు మించి వసూలు చేస్తుందనే అంచనాలు గుంటూరు డిస్ట్రిబ్యూటర్లలో ఉన్నట్టేనని తేలింది. కేవలం కోటి నలభై లక్షల రూపాయలకు గుంటూరు జిల్లా రైట్స్ ని సొంతం చేసుకున్న పంపిణీదారుడు అనూహ్యమైన ఈ స్పందనతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu