»   » చేదు నిజాలు: సింహాద్రి, మగధీర రెండూ అబద్దపు రికార్డులే(నా)..??

చేదు నిజాలు: సింహాద్రి, మగధీర రెండూ అబద్దపు రికార్డులే(నా)..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడంటే సినిమా అనేది ఒక జాతర కనీసం ఎంత చిన్న సినిమా అయినా 20-30 రోజులు మినిమం ఆడుతూ ఉండేది. ఇక స్టార్ హీరోల సినిమాలు 100 రోజులవరకూ నడిచేవి ఇక అభిమానులకి రిలీజ్, 50 డేస్, 100 డేస్ అంటూ పండగలే పండుగలు అయితే గత నాలుగు సంవత్సరాలలో ఆ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అసలు 50 రోజులు థియేటర్లో ఉండటమే గొప్ప అయినా ఇంకా 100, 500, 1000 రోజుల పోస్టర్లు వస్తూనే ఉన్నాయి.. అయితే ఇవన్నీ ఎంత వరకూ నిజమో ఎన్ని జెన్యూన్ రిపోర్ట్ లో జనానికి తెలుసు కాబట్టి పెద్దగా ఆవిషయాలని ఆలోచించటం మానేసారు ..

రికార్డుల తేనెతుట్టే ఇప్పుడు కదిలింది

రికార్డుల తేనెతుట్టే ఇప్పుడు కదిలింది

కానీ ఒకప్పటి సంగతి ఇలా కాదు కదా కేవలం పేపర్ల లోనూ, ఒకటీ రెండు న్యూస్ చానెళ్ళు తప్ప వేరే అవకాశం ఉండేది కాదు.... అవే నమ్మేసే వాళ్ళు అయితే అప్పటి రికార్డుల తేనెతుట్టే ఇప్పుడు కదిలింది కాదు కదిలించాడు.. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డు సినిమాల మీద వచ్చిన రిపోర్ట్ జెన్యూన్ కాదంటూ కుండ బద్దలు కొట్టాడు జక్కన్న...

అభిమానులకు చేదుగా అనిపించినా

అభిమానులకు చేదుగా అనిపించినా

టాలీవుడ్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సింహాద్రి.. మగధీర సినిమాల రికార్డుల విషయంలో నిజం లేదంటే..?? అభిమానులకు చేదుగా అనిపించినా ఇందులోనూ నిజం ఉంది. ఎవరో చెప్పటం వేరు ఆ సినిమాల దర్శకుడు రాజమౌళే ఈ సంగతి వెల్లడించాడు. ఈ సినిమాల రికార్డులు ఫేక్ అన్న తరహాలో మాట్లాడాడు రాజమౌళి.

వంద రోజులు ఆడినా ఆడకపోయినా

వంద రోజులు ఆడినా ఆడకపోయినా

ఈ విషయంలో తాను ఎంత ఇబ్బంది పడిందీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు జక్కన్న. ఇక మగధీర విషయం లో కూడా మగధీర సినిమా విడుదలైన సమయంలో అంతకు ముందు.... సినిమాలు వంద రోజులు ఆడినా ఆడకపోయినా.. థియేటర్ల సంఖ్య పెంచేసి.. ప్రకటించేవారు. అన్ని సినిమాలకూ జరిగే ప్రక్రియే ఇది. నాకేమో అలా నచ్చేది కాదు.

అక్కడితో ఆగకుండా

అక్కడితో ఆగకుండా

‘సింహాద్రి' సినిమా సరిగ్గా గుర్తులేదు కానీ చాలా థియేటర్లలో వంద రోజులు ఆడింది. అది జెన్యూన్‌. చాలా ఆనందపడ్డాం. అక్కడితో ఆగకుండా 175 డేస్‌ కూడా ఆడించాలని చెప్పి 15 థియేటర్లలో ఆడితే, మరో 15 థియేటర్లలో ఆడించారు. నాకది చాలా ఇబ్బందిగా ఉండేది. ‘సింహాద్రి' సినిమాకే కాదు, అన్ని సినిమాలకూ, అందరి హీరోలకూ ఇలానే ఉండేది.

దూరంగా ఉందాం సార్‌5

దూరంగా ఉందాం సార్‌5

నేను అరవింద్‌గారితో సినిమా మొదలుపెట్టినపుడు ఈ విషయాన్నే చర్చించాం. ‘అలాంటి ప్రకటనలకు మనం దూరంగా ఉందాం సార్‌' అన్నాను. ఆయన ‘ఓకే డన్‌' అన్నారు అని రాజమౌళి ఆర్కే ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ విషయాలు ఇప్పుడు చెప్పతమా అని అభిమానులకు అనిపించ వచ్చుగానీ తన సినిమాల విషయం లో మరీ అంత ఫాల్స్ రిపోర్ట్ ఇవ్వటం నచ్చకే నిజాయితీగా చెప్పేసాడు.

English summary
Truth is That Simhadri and Magadheera records are proclaimed fake by none other than director Rajamouli himself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu