రామ్ చరణ్ ది 'త్రీ'కథేనా?(స్పెషల్)

లాస్ట్ దీపావళికి షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన 'ఓం శాంతి ఓం' ని గుర్తు చేసే ఈ రెండు సినిమా కథల్లో ప్రేమికులు అయిన హీరో,హీరోయిన్స్ కి గత జన్మలో ఓ వ్యక్తి వల్ల దారుణం జరిగి విడిపోతారు. ఈ జన్మలో దానికి సంభందించిన ఆనవాళ్ళు దొరికి వాళ్లు మళ్ళీ కలవటం జరుగుతుంది. అంతేగాక ప్లాష్ బ్యాక్ లోనీ ప్రతీ క్యారెక్టర్ ఒక్కరు కూడా మిస్సవకుండా మళ్ళీ పుట్టి అంతా కలుసుకుని అప్పుడు జరిగిన సంఘటనలకు ఇప్పుడు రియాక్షన్స్ ఇస్తూంటారు. అంతేగాక తెరలు తెరలుగా గత జన్మల వాసనలను గుర్తు చేసుకుంటూంటారు.
ఇక రామ్ చరణ్ సినిమాలో శ్రీహరి పాత్ర ఆ జన్మలో హీరో,హీరోయిన్స్ విడిపోవటానికి కారణమైతే ఈ జన్మలో వారిని కలపటానికి అతను కృషి చేస్తాడని సమాచారం. అలాగే త్రి సినిమాలోనూ గత జన్మలో మెయిన్ లీడ్ విడిపోవటానికి కారణమైన రాజీవ్ కనకాల ఈ జన్మలో వారిని కలపటానికి కృషి చేస్తాడు. అయితే రామ్ చరణ్ సినిమా పక్కా కమర్షియల్ నార్మ్ కి అనుగుణంగా వెళ్తే...త్రీ సినిమాని ధ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తీసారు. ఈ రోజే త్రి సినిమా రిలీజు అవుతుంది. మరో విషయమేమిటంటే పునర్జన్మ ఆధారంగా వచ్చిన రిషికపూర్ కర్జ్ సినిమా మళ్ళీ హిమ్మేష్ రేష్మియా హీరోగా రూపుదిద్దుకుని ఈ రోజు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











