»   » ఖాకీ బట్టలేసి కేక పెట్టిస్తున్న 'సిమ్రాన్‌'

ఖాకీ బట్టలేసి కేక పెట్టిస్తున్న 'సిమ్రాన్‌'

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : ప్రముఖ నటి సిమ్రాన్‌ చాలా కాలం తరువాత చందనసీమకు తిరిగి అడుగు పెట్టింది. గతంలో శివరాజ్‌కుమార్‌తో 'సింహదమరి' సినిమాలో నటించింది. తాజాగా 'అలోన్‌' సినిమాలో పోలీసు అధికారి పాత్రను పోషిస్తోంది. వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొంది. ముందు ఈ పాత్రకు బాలీవుడ్‌ నటుడు సునిల్‌షెట్టిని అనుకున్నారు. చివరి నిముషంలో తేదీల సమస్య కారణంగా సిమ్రాన్‌ను ఎంపిక చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పతాక సన్నివేశాల్ని ఈనెల 15 నుంచి చెన్నైలో వారం రోజుల పాటు చిత్రీకరిస్తారు. అక్కడి బిన్నిమిల్‌ ప్రాంగణంలో ఇందుకోసం ప్రత్యేక సెట్‌ను నిర్మించారు. మంగళూరు తీరంలో ఇంటి సెట్‌ను నిర్మించి చాలావరకు చిత్రీకరణను అక్కడే కొనసాగించారు. వశిష్ట, నికిషా పటేల్‌, ఇనియా, గణేష్‌, సాధుకోకిలా, తబలా నాణి, దిలీప్‌, అవినాశ్‌, సురేష్‌, శాంతమ్మ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

నిర్మాత,దర్శకురాలుగానూ..

Simran plays a super cop in Alone

సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, నిన్ను చూడాలని, డాడీ, మృగరాజు వంటి ఎన్నో చిత్రాలలలో స్టార్ హీరోల సరనస చేసి వెలుగు వెలిగిన తార సిమ్రాన్‌ ఇప్పుడు సినిమా నిర్మాణ సంస్థను స్థాపించారు. అంతేకాదు ఆమె నిర్మాతగానూ మారుతోంది. ఒక ప్రకటన ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 'సిమ్రాన్‌ అండ్‌ సన్స్‌' పేరుతో బ్యానర్‌ని ప్రారంభించామన్నారు. దీని ద్వారా ఏడాదికి రెండు సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. సినిమాలపై తనకున్న ఎల్లలు లేని అభిమానమే సినిమా నిర్మాణ రంగం వైపు దృష్టి సారించేలా చేసిందని సిమ్రాన్‌ తెలిపారు.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ''సినిమా రంగం పట్ల నాకున్న ఆసక్తి, ప్రేమ అందరికీ తెలిసిందే. నటిగా అందరి ఆదరాభిమానాలు పొందిన నేను నిర్మాతగానూ మారుతున్నాను. సినిమా కెరీర్‌ తర్వాత బుల్లితెరపైనా నన్ను జనం అభిమానించారు. పరిశ్రమకు కొత్తవారిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించా. ఈ ఏడాది రెండు సినిమాలను విడుదల చేయనున్నాం. ఒక దానికి నేనే దర్శకత్వం వహిస్తా. నటిగా ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకులు ఇప్పుడు దర్శకురాలిగా కూడా అంతే అభిమానం చూపుతారనే నమ్మకం ఉంది''అని చెప్పారు.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలోనో లేక సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనో తారలు కేరక్టర్‌ ఆర్టిస్టులుగా మారడం చూస్తుంటాం. అలాకాకుండా నిర్మాతగానూ మారుతున్నవారూఉన్నారు. తాజాగా నిన్నటి తరం హీరోయిన్ సిమ్రన్‌ నిర్మాత కాబోతోంది.పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

English summary
Actress Simran who was last seen playing the role of Shivarajkumar's heroine in 'Simhada Mari' is all set to make a comeback to Kannada with a new film called 'Alone' starring Nikisha Patel. Simran is said to be playing the role of a super cop in the film.
Please Wait while comments are loading...