»   » అటుపెద్ద సినిమాలో చేస్తూనే ఇక్కడ వేశ్యగా కూడా.... ధన్సిక సాహసం

అటుపెద్ద సినిమాలో చేస్తూనే ఇక్కడ వేశ్యగా కూడా.... ధన్సిక సాహసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కబాలి' చిత్రంతో ప్రసిద్ధి చెందిన దన్షిక ప్రస్తుతం ఒక చిత్రంతో వేశ్య పాత్రలో నటించింది. తమిళ సినిమాలోని నటీమణులు ఎన్నో విభిన్న తరహా పాత్రలు పోషించినప్పటికీ కొన్ని కథా పాత్రల్లో నటించడానికి వెనుకాడుతుంటారు. ఆ విధంగా వెనకాడే పాత్రల్లో ఒకటే వేశ్య పాత్ర. అయినప్పటికీ కొందరు నటీమణులు ధైర్యంగా ఆ పాత్రను పోషించి తమ సత్తా చాటారు.

తమిళ సినిమాలో ఇటువంటి పాత్రను అలనాటి నటీమణి శ్రీప్రియ, శరణ్యా పొన్‌వన్నన్‌, స్నేహ, అనుష్క, సంగీత వంటి వారు నటించి తమ నటనా కౌసలాన్ని చాటుకున్నారు. వారి వరుసలో చేరడానికి ప్రస్తుతం దన్షికా సిద్ధమవుతున్నారు. అయితే ఈమె సినిమాలో కాకుండా ఒక షార్ట్‌ ఫిల్మ్‌లో వేశ్యగా నటించింది. 25 నిమిషాల నిడివి గల ఆ షార్ట్‌ ఫిల్మ్‌కు 'సినం' అని పేరు పెట్టారు. బెంగాలి నటి బిట్టాబోగ్‌ కూడా దన్షికాతో కలిసి నటించారు.

దీనికి లండన్‌ వాసి నేసన్‌ తిరునేసన్‌ నిర్మాణంలో ఆనంద్‌ మూర్తి దర్శకత్వం వహించారు. సంగీతం సమకూర్చడానికి ప్రముఖ సంగీత దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ గురించి దర్శకుడు ఆనంద్‌ మూర్తి మాట్లాడుతూ వెస్ట్‌బెంగాల్‌లో నివసించే ఒక వేశ్యను కలుసుకుంటాడు ఒక డైరెక్టర్‌.

"Sinam" A Short film acted by Actress Sai Dhansika

ఆమె పడుపు వృత్తిలోకి వెళ్లిన కారణాన్ని తెలుసుకున్న అతను చివరికి ఆమెను ఆ వృత్తికిలోకి నెట్టింది ఎవరనే విషయం తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. కథ ప్రకారం ఆ ఇద్దరూ మహిళను దేవతగా పూజించే మతానికి చెందినవారు. పొరుగు దేశం నుంచి వచ్చిన మహిళ ఏ విధంగా పడుపు వృత్తిలోకి నెట్టబడింది.. ఒక మహిళ సమాజంలో ఎదుర్కొనే సమస్యలను కళ్లకుకట్టే షార్ట్‌ ఫిలిం 'సినం'.

కబాలి చిత్ర నిర్మాణం టైం లోనే ఈ షార్ట్ ఫిలిం పనులు కూడా మొదలయ్యాయి అప్పట్లోనే ఆనంద్‌ మూర్తి దర్శకత్వం వహించబోయే ఈ లఘు చిత్రం గురించి యూనిట్‌ మాట్లాడుతూ, 'ఆనంద్‌ చెప్పిన కథ నచ్చడంతో వేశ్య పాత్ర అయినప్పటికీ ఈ లఘు చిత్రంలో నటించేందుకు ధన్సిక గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడం ఆనందంగా ఉంది.

గతంలో ఆమె లఘు చిత్రాల్లో నటించలేదు. కానీ ఈ స్క్రిప్టు విని చాలా ఎగ్జైట్‌ అయ్యారు. ఈ లఘు చిత్రాన్ని ఓ మంచి అవకాశంగా భావించారు. గతంలో ఆమె బోల్డ్‌ పాత్రల్లో నటించకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ లఘు చిత్రంలోని పాత్ర కోసం గత కొన్ని రోజులుగా ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ పాత్రకు సంబంధించిన పలు సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.

అంతేకాకుండా ఈ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాల్లోని నటీనటుల హావభావాలను కూడా బాగా పరిశీలిస్తున్నారు. కోల్‌కత్తా నేపథ్యంలో సాగే ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో బిడితా అనే పాత్రలో ధన్సిక నటించనుంది. ఓ వేశ్యకు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌కి జరిగే సంఘర్షణ ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందనే నేపథ్యంలో ఈ లఘు చిత్రం తెరకెక్కనుంది' అంటూ ఈ షార్ట్ ఫిలిం యూనిట్ ప్రకటించింది కూడా. కొన్నాళ్ళ క్రితం వెండితెర మీద పాతబడ్ద హీరోయిన్లు టీవీ సీరియళ్ళలో నటించేవాళ్ళు... ఇప్పుడు మాత్ర ఒకేసారి అటు పెద్ద సినిమాలు చేస్తూకూడా ఇటు లఘుచిత్రాలతో కూడా ప్రయోగాలు చేస్తున్నారు...

English summary
Sai Dhanshika Plays the Protagonist who happens to play a prostitute, introducing Bidita Bag a Bengalee & an Hindi Actress plays a Documentary filmmaker.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu