»   » సూసైడ్ అటెమ్ట్ చేయలేదని సింధుమీనన్ వివరణ

సూసైడ్ అటెమ్ట్ చేయలేదని సింధుమీనన్ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : హీరోయిన్ సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు రెండు రోజుల క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, తాను అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదని సింధు మీనన్ స్పష్టం చేసారు. తాను లండన్లో తన ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నానని తెలిపింది.

తెలుగులో 'చందమామ' చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సింధుమీనన్ ఆ తర్వాత వైశాలి చిత్రంతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లో నటించింది. అయితే ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఓ ప్రముఖ దినపత్రిక వెబ్ సైట్లో కూడా ఈ వార్త రావడంతో అంతా నిజమే అనుకున్నారు.

ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. సొంతగా సినీ నిర్మాణ సంస్థను స్థాపించాలనే ఉద్దేశ్యంతో అప్పులు చేసిందని, సమస్యల్లో ఇరుక్కోవడం వల్లనే ఇలా చేసిందనే ప్రచారం కూడా జరిగింది.

తనపై ఇలాంటి ప్రచారం మొదలు కావడంతో షాకైన సింధు మీనన్ వెంటనే స్పందించింది. పలు చిత్రాల్లో నటించినా...స్టార్ హీరోయిన్ నిలదొక్కుకోలేక పోయిన సింధు మీనన్ ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రభును పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీతో కలిసి లండన్లో సంతోషంగా ఉంది.

English summary

 Actor Sindhu Menon has come out against the rumours that she tried to commit suicide. She has said that the rumours are baseless and she is living happily with her family in London.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu