»   »  సూర్య ‘సింగం 3’: అనిరుద్ ఔట్... దేవిశ్రీ ప్రసాద్ ఇన్

సూర్య ‘సింగం 3’: అనిరుద్ ఔట్... దేవిశ్రీ ప్రసాద్ ఇన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ సూర్య, తమిళ డైరెక్టర్ హరి కాంబినేషన్లో వచ్చిన సింగం, సింగం 2 చిత్రాలు అటు తమిళంలో పాటు ఇటు తెలుగులోనూ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రెండు సినిమాల్లోనూ ఆడియో సూపర్ హిట్ అయింది.

త్వరలో సూర్య-హరి కాంబినేషన్లో ‘సింగం-3' రాబోతోంది. అయితే ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ ను కాకుండా తమిళ యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ను తీసుకున్నారు. అయితే మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ దర్శకుడు హరి దేవిశ్రీ ప్రసాద్ తోనే సింగం 3 చిత్రానికి మ్యూజిక్ చేయించాలని డిసైడ్ అయ్యాడు.

 Singam 3: Devi Sri Prasad in...

ప్రస్తుతం సూర్య హీరోగా '24' అనే చిత్రం రూపొందుతోంది... 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ '24' చిత్రం తెరకెక్కుతోంది...ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే సూర్య 'సింగం-3'లో నటించడానికి రెడీ అవుతున్నాడు. సూర్య, అనుష్కల జోడీయే ‘సింగం3'లోను అభిమానులను అలరించనుంది. అయితే తొలి రెండు భాగాల్లో ప్రేమికులుగానే మిగిలిపోయిన ఈ జంటకు మూడో భాగంలో పెళ్లి చేయాలని దర్శకుడు నిర్ణయించుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉంటారని తెలుస్తోంది.

సూర్యకు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు పలకరించాయి... 'సికిందర్, రాక్షసుడు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలు కావడంతో సూర్య ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు... ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితిలోనే సూర్యకు 'సింగం' చిత్రాలతో విజయాలను అందించాడు దర్శకుడు హరి... అదే తీరున సాగుతున్న సూర్యకు 'సింగం-3' కూడా విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.

English summary
Singam 3: Hari is keen on roping in only Devi Sri Prasad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu